తిరుమల లడ్డూ వివాదంపై సెప్టెంబర్ 30వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

తిరుమల లడ్డూ వివాదంపై సెప్టెంబర్ 30వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ముందుగా అక్టోబర్ 4న విచారణ చేపడతామని సుప్రీం తెలిపినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం విచారణ తేదీలో మార్పులు జరిగాయి. ఈ సందర్భంలో, వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మరియు బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి పిటిషన్‌లను కలిసి ఒకేసారి విచారించనుంది సర్వోన్నత న్యాయస్థానం.

లడ్డూ వివాదంపై నిజాలు వెలికి తీసేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని సుబ్రమణ్య స్వామి కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఈ సందర్భంగా, వైవీ సుబ్బారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, లడ్డూ అంశంపై జరుగుతున్న ప్రచారంలో నిజాలను వెలికి తీయాలని కోరారు. చంద్రబాబు వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ద్వారా నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదని తెలిపారు. యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో, ఆయన కింద పనిచేసే ఏజెన్సీలు కూడా అదే విషయాన్ని చెబుతాయని పేర్కొన్నారు. దీనిపై, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఫుడ్ టెక్నాలజీ ఎక్స్‌పర్ట్స్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Editor_Rahul

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *