దేశ రాజధానిలో గాలి కాలుష్యాన్ని అరికట్టడంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) విఫలమవడం పై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది

దేశ రాజధానిలో గాలి కాలుష్యాన్ని అరికట్టడంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) విఫలమవడం పై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గాలి నాణ్యత పర్యవేక్షణకు మరియు వాయు కాలుష్య నియంత్రణకు సరైన చర్యలు తీసుకోకపోవడంపై కోర్టు మండిపడింది. పంట వ్యర్థాలను కాల్చడం విషయంలో కమిటీలు ఏర్పాటు చేయకపోవడం, గతంలో కమిషన్ ఇచ్చిన హామీలు గాల్లో మాటలుగా మిగిలిపోవడం వంటి అంశాలను కోర్టు ప్రస్తావించింది.

సుప్రీం ధర్మాసనం, “పంట వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి కనీసం ఒక్క కమిటీ కూడా ఏర్పాటు చేయలేదు. ప్రతి ఏటా ఈ సమస్యను చూస్తుంటే CAQM చట్టం అమలు కావడం లేదని తెలుస్తోంది” అని పేర్కొంది. “దిల్లీ ఎన్‌సీఆర్ రాష్ట్రాలకు గతంలో చెప్పినవన్నీ గాల్లో మాటలుగానే మిగిలినట్లు కనిపిస్తోంది” అని సీఏక్యూఎంను నిలదీసింది.

సీఏక్యూఎం ఛైర్‌పర్సన్ స్పందిస్తూ, “గాలి కాలుష్య కట్టడికి మూడు సబ్ కమిటీలు ఏర్పాటు చేశామని, ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాన్ని నిర్వహిస్తున్నాం” అని తెలిపారు. దీనిపై సుప్రీం ధర్మాసనం, “అలాంటి సమావేశాలతో ఎంత సమర్థంగా పనిచేయగలుగుతున్నారో అర్థమవుతుందోని ఆశ్చర్యం వ్యక్తం చేసింది” అని పేర్కొంది.

సుప్రీం కోర్టు, పంట వ్యర్థాలకు సంబంధించి ప్రత్యామ్నాయాలను అమలు చేసేందుకు కృషి చేయాలని మరియు ఆ చర్యలకు సంబంధించిన సమగ్ర నివేదికను అందజేయాలని సీఏక్యూఎంను ఆదేశించింది.

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *