కళియుగ వైకుంఠ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా, నాలుగో రోజు సాయంత్రం, తిరుమల శ్రీమలయప్ప స్వామి ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై బకాసుర వధ ఆలంకారంతో ఊరేగుతారు.
ఈ రోజు ఉదయం కల్పవృక్ష వాహనంలో శ్రీదేవి, భూదేవి సమేత స్వామి నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. కల్పవృక్షం క్షీర సాగర మధనంలో ఉద్భవించిన విలువైన వస్తువులలో ఒకటి, దీని నీడన చేరిన వారికి ఎలాంటి లోటు ఉండదని పురాణాలు చెబుతున్నాయి.
సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు, శ్రీమలయప్ప స్వామి సర్వభూపాల వాహనంలో భక్తులను కనువిందు చేస్తారు. కల్పవృక్ష వాహనం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నం ఒంటిగంట నుండి మూడు గంటల వరకు స్నపన తిరుమంజనం జరుగుతుంది.
రాత్రి, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికి రాజు అని పురాణాల్లో ఉటంకించారు. మలయప్ప స్వామి సకల దిక్పాలకులకు రాజాధిరాజు అన్న భావనని వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరానికి కుబేరుడు, దక్షిణానికి యముడు, నైరుతిలో నిరృతి, తూర్పులో ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్ని, పశ్చిమంలో వరుణుడు, వాయువ్యంలో వాయువు, ఈశాన్యంలో పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా ఉంటారు. వీరందరూ స్వామివారిని తమ హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. ఈ వాహనం ద్వారా, ప్రజలకు ధన్యులవుతారు అనే సందేశాన్ని స్వామి తెలియజేస్తున్నారు