టీడీపీ జనసేన మధ్య కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ టిక్కెట్‌ వార్

కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు విషయంలో తెలుగుదేశం పార్టీ (టిడిపి), జనసేన పార్టీ (జెఎస్‌పి) మధ్య అంతర్గత వివాదం రాజుకుంది. జేఎస్పీ అధినేత పవన్ కళ్యాణ్ ఉదయభానుకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించగా.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆలపాటి రాజాకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో రెండు పార్టీల నాయకుల మధ్య పార్టీ వార్ మొదలైంది. టీడీపీ ఎమ్మెల్సీ టికెట్ కేటాయింపుపై నిర్ణయం తీసుకున్న తరువాత ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ తన పార్టీ లీడర్ కు టికెట్ ఇస్తానని మాట ఎలా ఇస్తారని పొలిటికల్ సర్కిల్ లో తీవ్ర చర్చ జరుగుతోంది. దీంతో కృష్ణా – గుంటూరు జిల్లాల్లో టీడీపీ, జనసేన నేతల మధ్య అంతర్గతంగా మాటల యుద్ధం నడుస్తోంది.
వివాదానికి కారణాలు ఇవి:
1. పవన్ కళ్యాణ్ హామీ:కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ స్థానానికి ఉదయభాను అభ్యర్థి ప్రకటిస్తున్నట్లు పవన్ కళ్యాణ్  హామీ ఇచ్చారు.
2. పవన్ హామీ కంటే ముందే చంద్రబాబు టికెట్‌ ఇచ్చేశారు: పవన్ కళ్యాణ్ తో చర్చించకుండానే టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజాకు టికెట్‌ ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
3. ఎమ్మెల్సీ టికెట్ పై పట్టు వీడని ఆలపాటి రాజా: చంద్రబాబు హామీతో ఎమ్మెల్సీ స్థానానికి పోటీకి సిద్ధమయ్యారు ఆలపాటి రాజా. పోటీకి కావాల్సిన కరపత్రాలు కూడా ప్రింటింగ్ చేయించారు. ఎవరేం చెప్పినా తన నామినేషన్‌ వేస్తానని పోటీ నుంచి పక్కకు తప్పుకోవనని తన అనుచరులతో చెబుతున్నారు.
4. పవన్ కళ్యాణ్ తీరు: ఉదయ భానుకు మద్దతు ఇస్తానన్న మాటను పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవడం రెండు పార్టీల మధ్య వివాదానికి దారి తీస్తోంది. ఈ పంచాయతీ చంద్రబాబు వద్దకు చేరగా డిల్లీ పర్యటన అనంతరం నిర్ణయం తీసుకుంటారని చెప్పినట్లు సమాచారం. దీంతో రెండు పార్టీల మధ్య సందిగ్ధత నెలకొంది. 100 రోజులకే పరిస్థితి ఇలా ఉంటే వచ్చే ఐదేళ్లు పొత్తు ప్రభుత్వం ఎలా ఉంటుందో.. నేతల మధ్య ఎన్ని వివాదాలకు దారి తిస్తాయో అన్న ఆందోళన మొదలైంది.
Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *