కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, అమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్పీలో చేరారు.
ముదునూరి మురళీకృష్ణంరాజు, టీడీపీ శ్రేణుల్లో మంచి స్థాయిలో ఉన్నారు, కానీ ఇటీవల టీడీపీపై ఆవేదన వ్యక్తం చేస్తూ, పార్టీలో అసంతృప్తితో ఉన్నారు. ఈరోజు ఆయన మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ స్వయంగా ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
మురళీకృష్ణంరాజు చేరికతో టీడీపీకి కాకినాడ జిల్లాలో పెద్ద దెబ్బ తగిలినట్లైంది. ముదునూరి స్థాయిలోని నాయకుడు వైసీపీలో చేరడం, స్థానికంగా టీడీపీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించబోతోందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.