ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా సర్వేలు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది తీవ్రమైన ఒత్తిడి . ఇంటింటా సర్వేలు, జియో ట్యాగింగ్ పేరుతో వారు అహోరాత్రులు పనిచేస్తున్నప్పటికీ, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత. ముఖ్యంగా ఉన్నత వర్గాలు, అపార్ట్మెంట్ నివాసితులు ఈ సర్వేలపై అనుమానం వ్య్కతం చేస్తున్నారు , సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల విరోధం ప్రత్యేకంగా స్పష్టమవుతోంది. “మాకు ప్రభుత్వ పథకాల అవసరం లేదు. మేం కట్టే ట్యాక్స్‌లు మా జీవితాలకు మేలు చేస్తాయి. మా వివరాలతో ప్రభుత్వానికి ఉపయోగం ఏమిటి?” అంటూ కొందరు ప్రజలు సచివాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు . కొన్నిచోట్ల అపార్ట్మెంట్ గేట్లు మూసివేయడం, సెక్యూరిటీ గార్డుల ద్వారా సిబ్బందిని వెనక్కి పంపించడం వంటి ఘటనలు గమనించవచ్చు.
ఉద్యోగుల ఆవేదన రోజురోజుకీ పెరుగుతోంది. అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయకపోతే, షోకాజ్ నోటీసులు, కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. సెలవులు లేకుండా పని చేయడం, అర్ధరాత్రి వరకు సర్వేలు నిర్వహించడం సాధారణమైపోయింది. అయితే, ప్రభుత్వం అవసరమైన వనరులు అందించకపోవడం ఉద్యోగులకు తీవ్రమైన ఆర్థిక, మానసిక ఒత్తిడిని పెంచుతోంది.
సచివాలయ సిబ్బంది వారి వ్యక్తిగత ఖర్చులతో పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో ఆవేశంతో తమ మొబైల్ ఫోన్లు పగులగొడుతూ తమ ఆవేదనను వ్యక్తపరిచిన ఉదంతాలు కూడా ఉన్నాయి. “సచివాలయ సిబ్బంది మాత్రమే అన్ని పనులు చేయాలా?” అంటూ కొందరు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు.
ఈ పరిస్థితులు ప్రభుత్వంపై వ్యతిరేకను పెంచుతున్నాయి. సచివాలయ సిబ్బంది అసంతృప్తి, వారి కుటుంబాలు మరియు పరిసరాల్లో ప్రజల దృష్టికి వెళ్లి, రాబోయే ఎన్నికలలో ప్రభావం చూపే ప్రమాదం ఉంది. గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను తొలగించి, అన్ని పనుల బాధ్యతలను సచివాలయ సిబ్బందిపైనే మోపడం అన్యాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వానికి అవసరమైన చర్యలు ఈ సమయంలో అత్యవసరం. సచివాలయ ఉద్యోగుల పనిభారం తగ్గించేలా చర్యలు తీసుకోవడంతో పాటు, వారికి తగిన వనరులు అందించాలి. ప్రజలలో అవగాహన పెంచి, సర్వేలపై నమ్మకం పెంపొందించడం కూడా కీలకం. ఇవి చేయకపోతే, సచివాలయ సిబ్బంది అసంతృప్తి మరింత తీవ్రమై, ప్రజలలో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశముంది.
సమగ్రంగా చూస్తే, సచివాలయ సిబ్బంది తమ సేవలు కొనసాగించాలంటే ప్రభుత్వ నుండి మద్దతు ఎంతో అవసరం. తగిన చర్యలు తీసుకోకపోతే, ఈ అసంతృప్తి పాలకులకు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.