ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో రాజ్యాంగ దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
ఈ వేడుకలో మంత్రులు నారా లోకేష్, ఎస్. సవిత, పి. నారాయణ, డోలా వీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్, రవికుమార్, బిసి జనార్థన రెడ్డి, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
“ఇవాళ పవిత్రమైన రాజ్యాంగ వజ్రోత్సవం రోజు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దది, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందించాలని లక్ష్యం. రాజ్యాంగ స్ఫూర్తిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓటు హక్కుతో రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే కాక, దుర్వినియోగం చేసిన నేతలకు ప్రజలు బుద్ధి చెప్తున్నారు. గత ఐదేళ్లలో ప్రాథమిక హక్కులు కాలరాశి, వ్యవస్థలు విధ్వంసం అయ్యాయి. ప్రజల కోసం రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించాలి”- సీఎం చంద్రబాబు
సిఎం చంద్రబాబు నాయుడు భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను, దాని ద్వారా సాధించబడిన సమానత్వం, న్యాయం మరియు సామాజిక హక్కులను గురించి ప్రసంగించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగం తీసుకున్న కీలక నిర్ణయాలు దేశంలో సామాజిక న్యాయాన్ని పెంపొందించడంలో ఎలా మైలురాయిగా నిలిచాయో వివరించారు.
అలాగే స్పెషల్ సిఎస్ లు కృష్ణబాబు, అనంతరాము, ముఖ్య కార్యదర్శులు ముకేష్ కుమార్ మీనా, శశి భూషణ్ కుమార్, పలువురు కార్యదర్శులు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, శాఖాధిపతులు, రాష్ట్ర సచివాలయ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది ఈ వేడుకలో పాల్గొని రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతపై చర్చించారు.