కానిస్టేబుల్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రస్తుతం పోలీసు నియామకాల ప్రక్రియ కొనసాగుతుండగా, అభ్యర్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకున్నారు.
పోలీసు నియామక మండలి ప్రకటించిన ప్రకారం, ఫిజికల్ టెస్టుల స్టేజ్ 2 కోసం దరఖాస్తుల గడువును డిసెంబర్ 6, 2024 వరకు పొడిగించారు. ఈ నిర్ణయం అభ్యర్థులకు మరింత సౌలభ్యం కలిగించడానికే తీసుకున్నట్లు తెలిపారు.
పోలీసు నియామక ప్రక్రియలో ఫిజికల్ టెస్టులు కీలకమైన భాగంగా ఉంటాయి. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అవసరమైన దస్తావజ్తులను సమర్పించి నిర్దేశిత తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ గడువు పెంపుతో అనేక మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించడానికి మరింత సమయం పొందనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభ్యర్థుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు.