వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ తీరుపై పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. ప్రజల ఆగ్రహాన్ని ఓ కార్యాచరణ రూపంలో నిలదీసేందుకు డిసెంబర్ నుంచి జనవరి వరకు మూడు ముఖ్యమైన కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించారు.
డిసెంబర్ 11:
రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ల వద్ద నిరసనలు.
- ధాన్యం సేకరణకు గడువు పెంపు.
- మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్.
- ఉచిత పంట బీమా పునరుద్ధరణ.
డిసెంబర్ 27:
విద్యుత్ చార్జీల పెంపుపై ఎస్సీ లేదా సిఎండి విద్యుత్ కార్యాలయాల వద్ద ఆందోళనలు.
- పెంచిన చార్జీలను తగ్గించాలని డిమాండ్.
జనవరి 3:
విద్యార్ధుల ఫీజు రీయింబర్స్మెంట్, వసతి, విద్యాదీవెన బకాయిల విడుదల కోసం కలెక్టరేట్ల వద్ద నిరసనలు.
ఈ ఉద్యమాల ద్వారా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వడమే లక్ష్యంగా జగన్ ప్రణాళికలు రూపొందించారు.