విజయవాడ:
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ను నడిరోడ్డుపై పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు అసహ్యమని, రైతులకు అండగా నిలబడడం తప్ప మరో తప్పు చేయలేదని అన్నారు.
అవినాష్‌తో పాటు మరికొంతమంది వైసీపీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారన్నది చెప్పకుండా పోలీసులు అస్పష్టంగా వ్యవహరించడంపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.