కడపలో జరిగిన వైఎస్సార్ కుటుంబ క్రిస్మస్ వేడుకలు ప్రేమ, ఐక్యత, కుటుంబ విలువలను ప్రతిబింబిస్తూ ఆత్మీయ దృశ్యాలుగా నిలిచాయి. ఈ సందర్భంగా కుటుంబ పెద్ద వైఎస్ విజయమ్మ.. తన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో కలిసి ఆప్యాయతను పంచుకున్నారు.
వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతీతో కలిపి జరుపుకున్న ఈ వేడుకలు, రాజకీయంగా ప్రాముఖ్యత కలిగినప్పటికీ, వ్యక్తిగత బంధాలను కాపాడుతూ చూపించిన అపూర్వ ఘట్టంగా నిలుస్తోంది. ఈ దృశ్యాలు కుటుంబంలోని ప్రేమ, అనుబంధాలను చాటి చెప్పేలా ఉన్నాయి.
వైఎస్ జగన్ కుటుంబం సమష్టిగా ఈ వేడుకలను జరుపుకోవడం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. “కుటుంబం ఐక్యత వైఎస్సార్ ఆశయాలను కొనసాగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది రాజకీయ ప్రయాణానికి కూడా సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది” అని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.
రాజకీయ ఒత్తిడుల మధ్య కుటుంబ విలువలు, ప్రేమ అనుబంధాలు జీవితానికి ఆనందాన్ని తీసుకురావచ్చని ఈ క్రిస్మస్ వేడుకలు నిరూపించాయి.
Also read:
https://voiceofandhra.org/telugu/2024/12/21/world-bank-approves-800m-loan-for-amaravati/