విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ పోరుబాట చేపట్టింది. విశాఖలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, ఇతర ముఖ్య నాయకులు కలిసి నిరసన పోస్టర్ను ఆవిష్కరించారు.
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు:
- విద్యుత్ ఛార్జీల పెంపు పై ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తామని వెల్లడించారు.
- జెపిసీ పర్యటనల గురించి ప్రస్తావిస్తూ, వైఎస్సార్సీపీ ప్రజల తరపున పోరాటానికి సిద్ధమని చెప్పారు.
- “మేము న్యూట్రల్ గా ఉన్నాం, రాష్ట్ర ప్రయోజనాలే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు.
గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు:
- ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలను పెంచమని హామీ ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన వెంటనే భారీగా భారాన్ని మోపిందని విమర్శించారు.
- “వచ్చే నెల నుంచి విద్యుత్ యూనిట్ పై అదనంగా రూ.1.50 వరకు భారాన్ని మోపుతారు” అని ఆందోళన వ్యక్తం చేశారు.
- “ఆరు నెలల కాలంలో రూ. 75 వేల కోట్ల అప్పు చేసి, సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు.”
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతున్నట్లు తెలిపారు.
Also read:
https://voiceofandhra.org/telugu/2024/12/24/tirupati-annamacharya-santa-hat-controversy/