పార్టీ మారినా.. పదవులకు నో గ్యారెంటీ? సందిగ్ధంలో తాజా మాజీ వైఎస్సార్ సిపి నేతలు!

– ఉన్న పోస్టు ఊస్ట్.. కొత్త పోస్టు ఆశలు ఫట్
– పార్టీ మారిన నేతలకు “కొత్త పార్టీ క్యాడర్ సహాయ నిరాకరణ”
– పార్టీ మారి తొందర పడ్డామా..? తప్పు చేశామా..?

ఏపీలో రాజకీయాలు షర వేంగంగా మారుతున్నాయి. నిన్నటి వరకు అధికార పక్షంలో ఉండి దర్పాన్ని ప్రదర్శించిన రాజకీయ నాయకులు ఇప్పుడు ప్రతిపక్షంలో ప్రజల కోసం పోరాడాలంటే ససేమిరా ఇష్టపడటం లేదు. కొందరు నేతలైతే రాత్రికి రాత్రే కండువాలు మార్చేస్తున్నారు. అందులో కొందరు నేతలు మొన్నటి వరకు మాజీ సిఎం జగన్ ఆహా ఓహో అంటే ఆకాశానికి ఎత్తేశారు. అధికారం పోగానే ఆయన తీరు సరికాదంటూ పార్టీకీ బై బై చెబుతున్నారు. పోనీ అధికార పార్టీలోకీ పోయినా అక్కడ ఏదైనా సంతృప్తిగా ఉన్నారంటే అబ్బా ప్చ్ ఏంటో మా పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా తయారయిందంటూ నిట్టూరుస్తున్నారు. ఇంతకీ అంతలా తెగ ఫీలవుతున్న నేతలెవరు..? వాళ్ల బాధేంటో చదివేయండి మరి.

ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయాక వైసీపీకీ పెద్ద కష్టాలే వచ్చి పడుతున్నాయి. అధికారంలో ఉన్నంత సేపు దాదాపు పదవులన్నీ వైసీపీవే ఉండేవి. కానీ ఎన్నికలు అయ్యాక పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా మారింది. 2019లో రికార్డు స్థాయిలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకీ వచ్చారు. అదే స్థాయిలో మిగితా పదవుల్లో కూడా వైసీపీదే హవా కొనసాగింది. అసెంబ్లీ, మండలి, జిల్లా పరిషత్ తో పాటు మెజార్టీ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలు కూడా వైసీపీ చేజిక్కించుకుంది. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీదీ ఏకఛత్రాధిపత్యంగా ఉండేది. అలాంటి వైసీపీకీ అధికారం కోల్పోయాక అసలు తత్వం బోధపడింది. పార్టీ కోసం, ప్రజల కోసం నిలబడే అసలు నాయకులెవరూ అర్థం అవుతోంది. అప్పుడు జంబో ప్యాక్ లో కనపించిన వైసీపీ ఇప్పుడు రోజుకింత చతికిలపడుతుంది. ఒక్కొక్కరుగా పార్టీ నుంచి టీడీపీ, జనసేన లోకి జారుకుంటున్నారు.

ఎన్నికల తరువాత రాష్ట్రంలో మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్ లతో మొదలైన నేతల కండువాల మార్పిడి చివరకు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల వరకు చేరింది. మరికొందరు వైసీపీ నేతలు రాజకీయ భవిష్యత్ కోసం అంటూ రాత్రికి రాత్రే కండువా మార్చేస్తున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనను ఆకాశానికి ఎత్తిన నేతలు ఇప్పుడు ఆయన మీదే కామెంట్లు, సెటైర్లు వేస్తున్నారు. జగన్ తీరు వల్లే పార్టీ ఓడిపోయిందంటూ ఒక సాకు చెప్పి పార్టీ మారుతున్నారు. ఇందులో విచిత్రం ఏంటంటే పార్టీ నుంచి పోతున్న వారిలో మెజార్టీ నేతలు జగన్ ఏరి కోరి పదవులు ఇచ్చిన వాళ్లే. అలాంటి వాళ్లే వైసీపీనీ వీడడంపై జగన్ బృందంలో తీవ్ర చర్చ జరగుతున్నట్లు సమాచారం. పార్టీ కష్టకాలంలో ఉంటే నేతలు ఇలా తమ స్వార్థం కోసం పార్టీనీ వీడడం సమంజసమేనా అని ప్రజలు, క్యాడర్ కూడా ప్రశ్నిస్తున్నారు.

ఉన్న పోస్టు ఊస్ట్.. కొత్త పోస్టు ఆశలు ఫట్

ఇటీవల పార్టీనీ వీడిన కొందరూ వైసిపి నేతలకు టీడీపీ, జనసేన పార్టీల్లో వింత అనుభవం ఎదురువుతుందంట. టీడీపీలోకి రావాలంటే పార్టీతో పాటు పదవులకు రాజీనామా చేసి రావాల్సిందే అని ఆ పార్టీ అధిష్టానం కండిషన్ పెట్టిందంట. దీంతో కొందరు నేతలు అక్కడి నుంచి ఆదేశాలు వచ్చేయే లేదో టక్కున ఢిల్లీ వెళ్లి రాజ్యసభ చైర్మన్ కు కలిసి రాజీనామా చేసిన ఎంపీలు కొందరైతే, మండలి ఛైర్మన్ కలిసి పదవులకు రిజైన్ చేయాల్సిన వాళ్లు మరి కొందరు. ఇలా వైసీపీకీ చెందిన రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు వెంటవెంటనే రాజీనామా చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యుల్లో ఇప్పటి వరకు ఇద్దరికీ పోస్టు గ్యారెంటీ అవకాశం దక్కింది. మరో నేత మాత్రం యధావిధిగా సందిగ్ధంలో ఉన్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్సీలకు కూడా వారి రాజకీయ భవిష్యత్తు ఏంటా అనే కంగారు మొదలైందంట. రాజీనామా అయితే చేసేసాం కానీ మనకు టీడీపీ అధిష్టానం ఎలాంటి పదవులు ఇస్తుందా అని తెగ ఆందోళన చెందుతున్నారట.

పార్టీ మారిన నేతలకు “కొత్త పార్టీ క్యాడర్ సహాయ నిరాకరణ”

ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్లు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెగ రెచ్చిపోయారు. అలాంటి వాళ్లకు మళ్లీ పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదని, కొత్త పార్టీ నేతలు, క్యాడర్ వారి అధిష్టానంతో బల్లగుద్ది చెబుతున్నారట. రాజీనామాతో ఖాళీగా ఉన్న పదవులను పార్టీ కోసం కష్టపడ్డవారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఇటీవల టీడీపీలో చేరిన వారి చెవిన పడతంతో వైసిపి తాజా మాజీలు తెగ ఖంగారు పడుతున్నాట్లు తెలుస్తోంది. మరి కొన్ని చోట్ల ఏకంగా వైసిపి నుంచి చేరికలను ఆయా జిల్లా అధికార నేతలు బాహాటంగా వ్యతిరేకిస్తున్నారు.

కొత్తగా చేరిన నేతల పదవులకు నో క్లియరెన్స్

వైసీపీ నుంచి చేరికల విషయంలో సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తుండడంతో అధిష్టానం కూడా తీవ్ర ఆలోచనలో పడిందంట. ప్రస్తుతానికి పార్టీలో చేరికల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని డిసైడ్ అయ్యిందంట. అయితే పార్టీలో మరో చర్చ కూడా వినపడుతుంది. కష్టకాలంలో పార్టీకీ అండగా నిలిచి, గత జగన్ ప్రభుత్వంలో బాగా ఇబ్బందులకు గురైన వారికి ఆ పదవుల్లో అవకాశం కల్పించాలని పార్టీ అధినేత ఆలోచిస్తున్నారట. అయితే టీడీపీలో చేరిన వారిలో కొందరి విషయంలో చంద్రబాబు సానుకూలంగా ఉన్నా మరి కొందరి విషయంలో మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

పార్టీ మారి తొందర పడ్డామా..? తప్పు చేశామా..?

ఇప్పుడు ఇదే వార్త ఇటీవల టీడీపీ జనసేనలో చేరిన నేతలను ఆలోచనలో పడేసిందంట. పార్టీ మార్పు విషంలో ఏదైనా తొందరపడ్డామా అని తమ అనచరుల వద్ద తెగ బాధపడిపోతున్నారట. ప్రతిపక్ష వైసీపీలో ఉన్నా మన పదవులు అలానే ఉండేవి. వైసీపీలో ఉంటూ కనీసం పదవులనైనా కాపాడుకునే చేసే వాళ్లం కదా అని అనుకుంటున్నారట. అయితే ఈ నేతలను చూసి ఏపీ పాలిటిక్స్ లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతుందంట. ఈ నేతలు ఏదో అనుకొని అధికార పార్టీలో చేరితో జరిగింది మరొకటి అని పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చ జరుగుతోంది.

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *