రాష్ట్రంలో గతేడాది జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత తెలుగు దేశం అధినేత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేసి, 16,347 టీచర్ పోస్టులను డిసెంబర్ 2024 లోపల భర్తీ చేస్తున్నామని ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల డీఎస్సీ నోటిఫికేషన్ కూడా రద్దు చేశారు. ప్రభుత్వం చెప్పిన తేదీ ముగిసిపోవడంతో డీఎస్సీ నిర్వహణపై ఆశావహులుప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
టెట్ పూర్తయి రెండు నెలలు
కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి కూడా మెగా డీఎస్సీ లో అవకాశం కల్పిస్తామని జులై నెలలో నోటిఫికేషన్ ఇచ్చి, ఆగష్టు నెలలో టెట్ పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పింది. చివరికి అక్టోబర్ నెలలో టెట్ పరీక్ష నిర్వహించింది. టెట్ ఫలితాలు వచ్చి రెండు నెలలైనా కూడా ఇప్పటికీ డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడలేదు. తాజాగా జిల్లాల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలు అందించాలని మరోసారి విద్యాశాఖకు ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. దీంతో ప్రభుత్వం కావాలనే వాయిదాలు వేస్తుందని కొందరు నిరుద్యోగులు విమర్శిస్తున్నారు.
Also read:
https://voiceofandhra.org/telugu/2025/01/02/ap-political-alliance-tensions/