టీడీపీలో మీ పదవికు రెండేళ్ళు నిండిందా? సస్పెన్షన్ గ్యారెంటీ? లోకేష్ సర్ మాటలే సంచలనం!
- లోకేష్ సర్ కొత్త వ్యూహం! రెండు పదవుల తర్వాత గండమే?
- క్రియాశీల నాయకులకు కలసివచ్చే కొత్త మార్గం?
టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ పార్టీలోని పదవులపై విప్లవాత్మక మార్పు తెచ్చే విధానం ప్రకటించారు. రెండు పదవుల్లో వరుసగా ఉన్న నేతలు తర్వాత ఉన్నత స్థాయికి ప్రమోషన్ పొందాలి లేదా కొంత కాలం విరామం తీసుకోవాలని కొత్త నిబంధన ప్రతిపాదించారు.
లోకేష్ తన వ్యక్తిగత అనుభవాన్ని ఉదహరించుతూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు లేదా తాను అయినా ఈ నిబంధనకు లోబడి, అవసరమైతే సామాన్య కార్యకర్తగా పని చేయడానికి సిద్ధంగా ఉండాలని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు టీడీపీ నేతల్లో కలకలం రేపుతున్నాయి.
ఈ వ్యూహం వెనుక కారణం ఏమిటంటే, గ్రామస్థాయిలో పనిచేసే వారికి పొలిట్ బ్యూరో స్థాయిలోకి వచ్చే అవకాశాలు కల్పించడమే. దీనిపై పార్టీ సభ్యులతో చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటామని లోకేష్ స్పష్టం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా ఉండి పర్యటన సందర్భంగా లోకేష్ తన ఆలోచనలను బహిరంగంగా వెల్లడించారు. ఈ కొత్త పాలసీతో టీడీపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.
Also read:
https://voiceofandhra.org/telugu/2025/01/07/dokka-seethamma-midday-meal-issues/