ఏపీలో 50 ఎమ్మెల్యే స్థానాల పెంపుకు గ్రీన్ సిగ్నల్

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2026 నాటికి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన ఖాయమైందని కేంద్రం సంకేతాలు పంపింది. ప్రస్తుతం 175 నియోజకవర్గాల సంఖ్య 225కు పెరగనుంది.

రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టత
2014 రాష్ట్ర విభజన సమయంలోనే అసెంబ్లీ స్థానాల పెంపుపై చర్చలు జరిగాయి. కానీ వివిధ కారణాలతో ఇది అమల్లోకి రాలేదు. విభజన చట్టంలో అనుకున్న విధంగా ఈ పునర్విభజన జరగకపోవడం రాజకీయాలపై ప్రభావం చూపింది.

2026లో ప్రారంభం కానున్న ప్రక్రియ
జనగణన మరియు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తరువాత, 2026 ద్వితీయార్థంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రతి పార్లమెంట్ స్థానంలో రెండేసి అసెంబ్లీ స్థానాలు పెంచే అవకాశం ఉంది.

నియోజకవర్గాల పెంపు ద్వారా ప్రయోజనాలు
అసెంబ్లీ స్థానాల పెంపుతో ప్రజలకు మరింత సమీపంగా పరిపాలన అందించవచ్చు. అలాగే, రాజకీయ ఆశావాహులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.

కేంద్రం సిద్ధం
కేంద్రం ఈ పునర్విభజన కోసం అన్ని విధాలా సన్నద్ధంగా ఉందని సమాచారం. జనగణన ప్రక్రియ పూర్తిచేసిన వెంటనే పునర్విభజన ప్రక్రియకు నాంది పలకనుంది.

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *