రక్షణ కల్పించే పోలీసులు కూడా పేకాట రాయుళ్ల దాడి నుండి తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి కాలనీ పాముల కాల్వ సమీపంలో పేకాట ఆడుతున్న సంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.
పేకాట సమయం దాటిపోతుందని, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో నియంత్రణకు వచ్చిన వన్ టౌన్ ఎస్‌ఐ హరిప్రసాద్‌పై పేకాట రాయుళ్లు తిరగబడ్డారు. ఎస్‌ఐను తోసివేయడమే కాకుండా, ఆయనపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
పేకాట నిర్వాహకుల ధైర్యం, పోలీసులపై దాడి చేయడం వంటి ఘటనలు ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.