శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గం, కొడవలూరు మండల కేంద్రంలో మాజీ మంత్రివర్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
కోవూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వపు కక్ష సాధింపులో భాగంగా సర్పంచ్ ల చెక్ పవర్ రద్దు చేయడం, విఓఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు మధ్యాహ్న భోజన నిర్వాహకులు రేషన్ డీలర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలను తొలగించడాన్ని నిరసిస్తూ, మండల పరిషత్ కార్యాలయం వరకు సాగిన భారీ ర్యాలీ.
మండల అధికారులకు వినతిపత్రం సమర్పించిన తర్వాత భారీగా విచ్చేసిన ప్రజలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన వీరి చలపతి, ప్రసన్న, కాకాణి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నినాదాలతో దద్దరిల్లిన కొడవలూరు మండల కేంద్రం.
కూటమి ప్రభుత్వం పాల్పడుతున్న అక్రమాలు, అధికారుల నిర్వాకాలపై మండిపడ్డ కాకాణి, ప్రసన్న.
పోలీసు కేసులకు భయపడమని, ప్రజల సమస్యలపై పోరాడుతామని తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దె దించి, జగనన్నను ముఖ్యమంత్రి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్న కాకాణి.
భారీగా తరలి వచ్చిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలియజేసిన ప్రసన్న, కాకాణి.