ఔరా…! ఇవేం స్టెప్పులు కలెక్టర్ సారూ?

కృష్ణా జిల్లా, మచిలీపట్నం:
రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ దంపతులు పలు డ్యూయెట్ పాటలకు స్టెప్పులు వేసి సందడి చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రిపబ్లిక్ డే అంటే దేశభక్తి ఉప్పొంగించే పవిత్రమైన రోజు. అయితే, ఆ రోజున ఉదయం దేశ సేవలో భాగస్వామ్యమవుతూ, సాయంత్రం డ్యూయెట్ పాటలకు డ్యాన్స్ చేయడం కలెక్టర్ గారి కొత్త ఆవిష్కరణగా మారింది.

ఆదివారం సాయంత్రం కలెక్టర్ బాలాజీ తన క్యాంప్ కార్యాలయంలో ‘AT HOME’ వేడుకను జిల్లా అధికారుల కోసం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన దంపతులు పలు ప్రముఖ డ్యూయెట్ పాటలకు స్టెప్పులు వేసి జిల్లా అధికారులను అలరించారు.

కలెక్టర్ దంపతుల డ్యాన్స్‌కు ముగ్ధులైన జిల్లా అధికారులు కూడా వారితో కలిసి ఆడిపాడారు. ఈ సందడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ప్రజలు “ఔరా, ఇవేం స్టెప్పులు కలెక్టర్ సారు” అంటున్నారు.

ముఖ్య విశేషం ఏమిటంటే, ఈ వేడుకలకు మీడియాను పూర్తిగా దూరం పెట్టడం. ఇది ప్రజలలో ఆసక్తిని మరింత పెంచింది.

సామాన్య ప్రజలు ఈ వీడియోలపై మిశ్ర మైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది సరదాగా చూసుకుంటే, మరికొందరు రిపబ్లిక్ డే లాంటి పవిత్రమైన రోజున ఇలాంటి కార్యక్రమాలు చర్చనీయాంశంగా మారడం అంటున్నారు.

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *