ధర్మవరంలో ఉద్రిక్తత: టీడీపీ క్యాడర్ vs బీజేపీ క్యాడర్

ధర్మవరం: ధర్మవరంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ, బీజేపీ క్యాడర్ మధ్య ఘర్షణ జరగగా, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

వివరాల్లోకి వెళ్తే, ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ సమక్షంలో, వైసీపీకి చెందిన మైనార్టీ నేత కృష్ణాపురం జమీర్ సోమవారం బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే, జమీర్ బీజేపీ చేరికను టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ తీవ్రంగా వ్యతిరేకించారు.

జమీర్ చేరికకు సంబంధించి బీజేపీ శ్రేణులు ధర్మవరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా, టీడీపీ శ్రేణులు వాటిని చించివేశారు. ఈ వ్యవహారం ఇరువర్గాల మధ్య గొడవకు దారితీసింది. మొదట వాగ్వాదంగా ప్రారంభమైన ఈ సంఘటన, రాళ్లదాడిగా మారింది.

ఈ ఘర్షణలో రెండు స్కార్పియో కార్లు, మూడు బైకులు ధ్వంసమయ్యాయి. ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Also read:

https://voiceofandhra.org/telugu/2025/01/17/pulivendula-sand-tenders-tdp-janasena-controversy/

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *