కూటమి ప్రభుత్వంలొ 56 వేల సచివాలయ ఉద్యోగాలు హూస్టింగ్..!

కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్ విధానానికి శ్రీకారం చుట్టింది. 10 కిలోమీటర్ల లోపు ఉన్న సచివాలయాలను విలీనం చేయడం, ఉద్యోగుల స్కిల్ మ్యాపింగ్ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. గ్రామస్థాయి సేవల అందుబాటులోకి తీసుకురావడానికి ప్రారంభమైన ఈ సచివాలయ వ్యవస్థ రేషనలైజేషన్‌ నిర్ణయం ద్వారా ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుందని సంఘాలు పేర్కొంటున్నాయి.

సచివాలయ ఉద్యోగుల విభజన

ప్రభుత్వం ప్రకారం, సచివాలయాలను జనాభా ఆధారంగా 3 కేటగిరీలుగా విభజించారు:

  1. A కేటగిరీ: 3,500 పైగా జనాభా – 6 ఉద్యోగులు
  2. B కేటగిరీ: 2,501–3,500 జనాభా – 7 ఉద్యోగులు
  3. C కేటగిరీ: 2,500 లోపు జనాభా – 8 ఉద్యోగులు

ఉద్యోగుల తొలగింపు అనివార్యం?

ప్రస్తుత 1,61,202 ఉద్యోగుల్లో 56,174 మంది ఉద్యోగులు రేషనలైజేషన్ వల్ల ఉద్యోగాలు కోల్పోతారు. ఈ అదనపు సిబ్బందిని ఇతర శాఖలకు పంపించనుండగా, కొత్తగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసే అవకాశం లేకుండా పోయే ప్రమాదం ఉంది.

సచివాలయ సేవల్లో మార్పులు

  • విలీనం: సమీప గ్రామ సచివాలయాల విలీనం.
  • స్కిల్ మ్యాపింగ్: మల్టీ పర్పస్, టెక్నికల్, ఆస్పిరేషనల్ కేటగిరీలుగా ఉద్యోగుల విభజన.
  • విధుల విస్తరణ: సచివాలయ సేవలతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల్లో నియామకం.

ఉద్యోగుల్లో అసంతృప్తి

రేషనలైజేషన్ వల్ల స్థానిక ఉద్యోగులు దూర ప్రాంతాలకు బదిలీ అవ్వడం, సొంత గ్రామంలో సేవల అవకాశాలు కోల్పోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ నిర్ణయాలు సచివాలయ సేవలను ప్రభావితం చేయడమే కాకుండా ఉద్యోగుల ఆర్థిక, కుటుంబ పరిస్థితులపై గడ్డు పరిస్థితులను తీసుకురావడంపై ఉద్యోగుల వర్గాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *