కూటమి ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే బ్రిడ్జి సైడ్ వాల్ కూలింది: మున్సిపల్ చైర్‌పర్సన్ మాభూన్నిసా

నంద్యాల, 29 జనవరి 2025: నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని సలీంనగర్‌లో నూతనంగా నిర్మించిన బ్రిడ్జి ప్రక్కన డ్రైనేజ్ పనుల కోసం మట్టిని త్రవ్వడంతో సైడ్ వాల్ కూలిపోయింది. ఈ ఘటన పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానిక ప్రజలు ఆరోపించారు.

ఈ ఘటనపై నంద్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ మాభూన్నిసా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్యమే బ్రిడ్జి కూలడానికి కారణమని, తమ తప్పిదాన్ని అధికారులు స్వయంగా అంగీకరించారని ఆమె వెల్లడించారు.

అయితే, నిన్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకులు ఈ ఘటనను రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రభుత్వం, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేశారు. కానీ, నేడు అధికారుల అంగీకారంతో వాస్తవం బయటకు వచ్చింది.

ఈ నేపథ్యంలో నంద్యాల వైసీపీ నాయకులు టీడీపీ నేతల తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నిజాన్ని తెలుసుకోకుండా వైసీపీ ప్రభుత్వంపై, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపై దుష్ప్రచారం చేయడం తగదని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకోవాలని హెచ్చరించారు.

Also read:

https://voiceofandhra.org/telugu/2025/01/29/tdp-mla-gummanur-jayaram-threatens-journalists/

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *