తెలుగు రాష్ట్రాల్లో మీడియా సంస్థలు కొన్ని కుల ప్రయోజనాలను మాత్రమే చూసుకుంటున్నాయా? ఒకే సామాజిక వర్గం అధికారం చెలాయిస్తోందా? కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
మీడియా కులపక్షపాతం పై మల్లన్న సంచలన వ్యాఖ్యలు
తీన్మార్ మల్లన్న ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారం చేసిన ఓ ఇంటర్వ్యూలో, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మీడియా సంస్థలు దాదాపు ఒకే కులానికి చెందినవని సంచలన ఆరోపణలు చేశారు. ఈ మీడియా సంస్థలు ప్రజాస్వామ్యానికి నష్టం చేస్తున్నాయని, ఇతర సామాజిక వర్గాల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
“కమ్మ మీడిమా.. కుల మీడియా” – మల్లన్న
మల్లన్న మాటల్లోనే చెప్పాలంటే, “తెలుగు రాష్ట్రాల్లో మీడియా పూర్తిగా కమ్మ కులస్తుల ఆధీనంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇతర కులాలకు చెందిన నాయకులు చేసే మంచిని, వారి ఉద్యమాలను చూపించే అవకాశం లేకుండా చేస్తున్నారు.”
అయితే, తాను అనవసర ఆరోపణలు చేస్తున్నట్టు అనుకోవద్దని, ఈ విషయాన్ని ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేలా కొన్ని మీడియా సంస్థల వివరాలను కూడా మల్లన్న బయటపెట్టారు.
మీడియా యాజమాన్యాల్లో కుల వివరణ (మల్లన్న ప్రకారం)
దినపత్రికలు:
- ఈనాడు – కమ్మ
- ఆంధ్రజ్యోతి – కమ్మ
- సాక్షి – రెడ్డి
- డెక్కన్ క్రానికల్ – రెడ్డి
- నమస్తే తెలంగాణ – వెలమ
- ఆంధ్రప్రభ – వైశ్య
- వార్త – వైశ్య
టీవీ చానెల్స్:
- టీవీ 9 – కమ్మ
- ఎన్టీవీ – కమ్మ
- ఏబీఎన్ – కమ్మ
- మహా టీవీ – కమ్మ
- టీవీ 5 – కమ్మ
- సీవీఆర్ న్యూస్ – కమ్మ
- జెమిని – కమ్మ
- ఏ టీవీ – కమ్మ
- ఇన్ కేబుల్ – కమ్మ
- మా టీవీ – కమ్మ
- టీ న్యూస్ – వెలమ
- హెచ్ఎం టీవీ – వెలమ
- సాక్షి టీవీ – రెడ్డి
“ప్రజలకు నమ్మకం లేకుండా చేసిందీ మీడియా”
“ఈ పరిస్థితుల్లో మీడియాలో వచ్చిన కథనాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు” అని మల్లన్న అన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇతర సామాజిక వర్గాలు పన్నులు కట్టిన पैసులతో ఈ మీడియా సంస్థలు తమకు అనుకూలమైన ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
సామాజిక వర్గాలకు మద్దతుగా మీడియా నిలబడలేదా?
ఎమ్మెల్సీ మల్లన్న మీడియా సంస్థలను బహిరంగంగా ప్రశ్నించారు –
“మీరు ఎప్పుడైనా బీసీల కోసం పోరాడారా? ఎప్పుడైనా ఎస్సీ, ఎస్టీ ప్రజల సమస్యలను ప్రభుత్వాల ముందు ఉంచారా? ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాల అభివృద్ధికి మీడియా నడుం కట్టాలి, కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది!”
మల్లన్న వ్యాఖ్యలపై భిన్న అభిప్రాయాలు
మల్లన్న చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొందరు మల్లన్న వ్యాఖ్యలను సమర్థించగా, మరికొందరు ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
తీర్పు ప్రజలదే! తెలుగు రాష్ట్రాల్లో మీడియా సంస్థలు నిజంగానే ఒకే కులానికి సేవ చేస్తున్నాయా? లేదా మల్లన్న ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నవేనా?
మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి!