పవన్ కళ్యాణ్ మరోసారి అసాధ్యాన్ని సాధ్యంగా మార్చారు. ఆయన తెదేపా, బీజేపీ, జనసేనను ఒకే వేదికపైకి తీసుకొచ్చి కూటమిని విజయవంతంగా ముందుకు నడిపించారు. ఈ కూటమి ఘనవిజయం సాధించి, 175 స్థానాల్లో 164 సీట్లు గెలుచుకుంది. తొలుత పైకి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కలిసి ముందుకు వెళుతున్నట్టే కనిపిస్తోంది. కానీ లోపల మాత్రం జనసేన కార్యకర్తల్లో ఇప్పటికీ సందేహాలు తగ్గలేదు.
జనసేన అనుచరుల్లో అనుమానాలు
జనసేన కార్యకర్తల్లో చాలా మంది బీజేపీపై విశ్వాసం ఉంచినప్పటికీ, తెదేపాని మాత్రం ఇంకా అనుమానంగా చూస్తున్నారు. ‘‘పవన్ కళ్యాణ్ అసలైన అవకాశం దక్కించుకుంటారా? లేక లోకేష్ రాజకీయ వారసత్వానికి మార్గం సుగమం చేస్తారా ?’’ అనే ప్రశ్న తలెత్తుతోంది.
విభేదం ఇంకా వీడలేదు
ఈ అనుమానాలకు చారిత్రిక కారణం వుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదటినుండి కమ్మ, కాపు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి . 1980ల్లో వంగవీటి రంగ హత్య ఈ విభేదాన్ని మరింత లోతుగా మార్చింది. అప్పటి నుంచి కొన్ని కాపు వర్గాలు తెదేపాపై పూర్తిగా నమ్మకం కోల్పోయాయి.
ఇది కేవలం రాజకీయంగానే కాకుండా సినీ రంగానికి కూడా విస్తరించింది. కమ్మ సామాజిక వర్గం నందమూరి వారసులను ప్రోత్సహిస్తే, కాపు వర్గం మెగా ఫ్యామిలీకి మద్దతుగా నిలిచింది. ఆంధ్రాలో సినిమాలకి రాజకీయానికి వున్నా విడదీయరాని సంబంధం తెలిసిందే.
2024 ఎన్నికల్లో జనసేన 21/21 విజయంతో చలానాలుగా అధికారం చేజికించుకోవాలి అని చూస్తున్న కాపు సామాజిక వర్గానికి ఉత్సాహం పెరిగింది. ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఇక ముందు మరింత బలంగా ఎదుగుతారు అని అనుకుంటున్నారు. కానీ అసలు నిజం ఏమిటంటే, హోదా వచ్చినంత మాత్రాన అధికారం రాదు. ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన చేతిలో అధికారం లేదు.
బీజేపీ మౌన వ్యూహం
జనసేన కార్యకర్తల్లో చాలా మంది బీజేపీ నిజమైన మిత్రపక్షమని నమ్ముతున్నారు. కానీ వారు అసలు నిజాన్ని ఇంకా గ్రహించడం లేదు. బీజేపీకి పొత్తులు శాశ్వతం కాదు. అవసరం ముగిశాక, మిత్రులను బలహీనపరచడం బీజేపీ వ్యూహంగా మార్చుకుంది.
శివసేననే చూడండి. ఓకాలంలో బీజేపీకి అత్యంత సమీప మిత్రపక్షంగా ఉన్న శివసేన, మోదీ-షా వ్యూహానికి బలైపోయింది. ఆ పార్టీని చీల్చి బలహీనపరిచారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో జనసేనకు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది.
ప్రస్తుతం బీజేపీ పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ఉంది. కానీ అది ఎంత కాలం ఉంటుంది అనేది ప్రశ్న. బీజేపీ వ్యూహం ఆంధ్రప్రదేశ్‌లో తన బలాన్ని పెంచుకోవడమే. జెనసేనను కేవెలం తమ బలం పెంచుకోవడానికే వాడుకుంటుంది ఏ క్షణం ఐతే జనసేన బలంగా మారుతుంది అని గ్రహిస్తుందో, బీజేపీ తన ఆట మొదలుపెడుతుంది. పవన్ కళ్యాణ్ జనసేనను బీజేపీలో విలీనం చేయకపోతే, భవిష్యత్తులో బీజేపీ ఆయన్ను బలహీనపరచే అవకాశం ఉంది.
జనసేన కార్యకర్తలకు హెచ్చరిక
బీజేపీ వ్యూహాన్ని చంద్రబాబు బాగా అర్థం చేసుకున్నారు. అందుకే తెదేపా, బీజేపీ, జనసేనల మధ్య సమతుల్యతను కాపాడుతూ ముందుకు సాగుతున్నారు. కానీ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన జనసేన అనుచరులు దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం లేదు. తాత్కాలిక విజయాలను ఆస్వాదిస్తూ, భవిష్యత్తు సవాళ్లను పట్టించుకోకుండా ఉన్నారు.
జనసేన ఇకనైనా నిజాన్ని గ్రహించాలి. కేవలం పొత్తులపై ఆధారపడితే, శాశ్వతంగా చిన్న భాగస్వామిగా మిగిలిపోతుంది. పార్టీని బలోపేతం చేయకపోతే, భవిష్యత్తులో జనసేనని ఇతరులు నియంత్రించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా మేలుకోకపోతే, ఆటలో ఒక అరటిపండుగా మారిపోయే ప్రమాదం ఉంది.