ఏపీలో రేపటి నుంచే భూముల మార్కెట్ ధరల పెంపు!

అమరావతి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి (ఫిబ్రవరి 1) నుంచి భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ రేట్లు పెరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని 10-20% మేర భూముల మార్కెట్ ధరలు పెరుగుతుండగా, నగర ప్రాంతాల్లో నిర్మాణ విలువల్లో 6% వరకు పెరుగుదల ఉంది.

భూముల ధరలు & రిజిస్ట్రేషన్ రేట్లు ఎలా మారనున్నాయి?

అభివృద్ధి ప్రాతిపదికన భూముల రేట్లను 10% నుంచి 20% వరకు పెంచనున్నారు.
నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో నిర్మాణ విలువలు 6% పెరుగుతాయి.
పెంకుటిళ్లు, రేకుల షెడ్లు, ఇతర నిర్మాణాలకు చదరపు అడుగుకు ₹740, ₹580, ₹420 గా నిర్ణయం.
ప్లాట్లకు (గ్రౌండ్, 1st, 2nd ఫ్లోర్):

  • గ్రౌండ్ ఫ్లోర్: ₹1,490
  • ఫస్ట్ ఫ్లోర్: ₹1,270
  • సెకండ్ ఫ్లోర్: ₹900

ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ప్రభావం చూపనుంది. రిజిస్ట్రేషన్ రేట్ల పెంపుతో లావాదేవీలు త్వరగా పూర్తిచేయాలని ప్రాపర్టీ కొనుగోలుదారులు భావిస్తున్నారు.

👉 రియల్ ఎస్టేట్ రంగంపై ఈ నిర్ణయం ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి!

Also read:

https://voiceofandhra.org/telugu/2025/01/31/mla-kakarla-suresh-tdp-udayagiri-crisis/

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *