బాబు ష్యూరిటీ.. చీటింగ్‌ గ్యారెంటీ: మాజీ మంత్రి ఆర్‌కె రోజా ఫైర్‌

📍 చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్‌కె రోజా

🔹 సూపర్‌సిక్స్‌ అమలు చేయకపోతే కాలర్‌ పట్టుకోమన్నారు. మరి ఇప్పుడు ఎవరి కాలర్‌ పట్టుకోవాలో లోకేష్‌ చెప్పాలి!
🔹 ఫీజు రీయింబర్స్‌ లేక విద్యార్థుల నానా ఇక్కట్లు
🔹 ఫీజులు, స్కాలర్‌షిప్స్‌ బకాయిలు రూ.3900 కోట్లు
🔹 ఫిబ్రవరి 5వ తేదీలోగా ఆ బకాయిలన్నీ చెల్లించాలి
🔹 ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం
🔹 విద్యార్థులకు వైయస్సార్‌సీపీ అండగా నిలుస్తుంది
🔹 హామీలు అమలు చేతకాక పోతే దిగిపొండి
🔹 పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదు?
🔹 ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే మహిళలను వేధిస్తారా?

చంద్రబాబు ష్యూరిటీ.. చీటింగ్ గ్యారెంటీ: ఆర్‌కె రోజా

ఎన్నికల ముందు ఎన్నెన్నో హామీలు గుప్పించి, ఆ తర్వాత ఏదీ అమలు చేయని సీఎం చంద్రబాబు.. “బాబు ష్యూరిటీ చీటింగ్‌ గ్యారెంటీ” గా మారారని వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్‌కె రోజా ఆక్షేపించారు. సూపర్‌సిక్స్‌ అమలు చేయకపోతే, కాలర్‌ పట్టుకోవాలన్న నారా లోకేష్, ఇప్పుడు ఎవరి కాలర్‌ పట్టుకోవాలో చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు.

ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఆమె.. ఫీజులు, స్కాలర్‌షిప్‌ కింద ప్రభుత్వం రూ.3900 కోట్లు బకాయి పడిందని చెప్పారు. ఈనెల 5లోగా ఆ మొత్తం చెల్లించకపోతే, విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తామని నగరిలో మీడియాతో మాట్లాడిన రోజా ప్రకటించారు.

చంద్రబాబు అసమర్థత

🔹 ఎన్నికల ముందు రాష్ట్ర అప్పులు రూ.14 లక్షల కోట్లు అంటూ దుష్ప్రచారం చేసిన చంద్రబాబు
🔹 తాము అధికారంలోకి వస్తే సూపర్‌సిక్స్‌ అమలు చేస్తామని ప్రకటించారు
🔹 కానీ రాష్ట్ర వాస్తవ అప్పులు రూ.4.6 లక్షల కోట్లు అని మీరే తేల్చారు
🔹 మరి అలాంటప్పుడు సూపర్‌సిక్స్‌ ఎందుకు అమలు చేయడం లేదు?
🔹 లోకేష్‌ కాలర్‌ పట్టుకుంటే తప్ప పథకాలు అమలు కావా?
🔹 ఇంత జరుగుతున్నా పవన్‌కళ్యాణ్‌ ఎందుకు ప్రశ్నించడం లేదు?

ఫిబ్రవరి 5 డెడ్‌లైన్‌

🔸 ప్రభుత్వం వెంటనే రూ.3,900 కోట్లు విడుదల చేయాలి
🔸 ఫిబ్రవరి 5లోగా చెల్లించకపోతే, విద్యార్థులతో కలిసి రోడ్డెక్కుతాం
🔸 విద్యార్థులకు వైయస్సార్‌సీపీ అండగా నిలుస్తుంది
🔸 విద్యాదీవెన కింద రూ.2800 కోట్లు, వసతిదీవెన కింద రూ.1100 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి

అన్ని వర్గాలకు వంచన

చంద్రబాబు ప్రభుత్వం ప్రతి వర్గాన్నీ మోసం చేసిందని ఆక్షేపించిన రోజా..
✔️ విద్యార్థులు – ఫీజుల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు
✔️ రైతులు – ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు
✔️ మహిళలు – ఎన్నికల హామీలు అమలు కాక ఇబ్బంది పడుతున్నారు
✔️ నిరుద్యోగులు – నిరుద్యోగ భృతి దొరకలేదు

చేతకాకపోతే దిగిపొండి!

“బటన్‌ నొక్కడం పెద్ద విషయమా.. ముసలమ్మ కూడా బటన్‌ నొక్కుతుందని అవహేళనగా మాట్లాడిన చంద్రబాబు, అంత తేలికైన విషయమైతే ఇప్పుడెందుకు నొక్కలేకపోతున్నారు?” అని నిలదీశారు. హామీలు అమలు చేయడం చేతకాకపోతే ప్రజలకు క్షమాపణలు చెప్పి, వెంటనే పదవులకు రాజీనామా చేయాలి అని డిమాండ్‌ చేశారు.

అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

🔹 ప్రభుత్వం రూ.1.19 లక్షల కోట్ల అప్పు చేసింది. మరి ఆ డబ్బంతా ఏమైంది?
🔹 దేని కోసం ఖర్చు చేశారు? అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
🔹 కోవిడ్ సమయంలో సంక్షేమ పథకాలు ఆపకుండా అమలు చేసిన జగన్‌ పాలనను చూసి నేర్చుకోవాలి

చూస్తున్నా.. స్పందించరా పవన్‌?

🔹 ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే వైయస్సార్‌సీపీ మహిళలను వేధిస్తారా?
🔹 మీ కూటమిలో ఉన్నవారే మహిళలా? మిగిలిన మహిళల రక్షణ ప్రభుత్వ బాధ్యత కాదా?
🔹 తాట తీస్తామన్న పవన్ కళ్యాణ్ మాటలకే పరిమితమా?
🔹 వైయస్సార్‌సీపీ మహిళల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *