బడ్జెట్ కేటాయింపుల్లో బీహార్‌కు వరాలు – ఆంధ్రప్రదేశ్‌కు నిరాశ
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ మరోసారి వెనుకబడింది. కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌కు తగిన నిధులు కేటాయించని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బీహార్‌కు మాత్రం భారీగా నిధులు ప్రకటించారు. దీంతో, “ఇది కేంద్ర బడ్జెట్టా? లేక బీహార్ ప్రణాళికా పద్దా?” అనే ప్రశ్నలు చెలరేగాయి.
బీహార్‌కు వరాలు:
- మఖానా (ఫాక్స్ నట్) ఉత్పత్తి కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు.
- మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 ఎకరాలకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసి కెనాల్‌కు ఆర్థిక సహాయం.
- గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, ఐఐటీ పాట్నా విస్తరణ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఏర్పాటు.
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయాలను రాజకీయ నిపుణులు సాఫ్ట్‌కార్నర్ ప్రదర్శనగా అభిప్రాయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఆశలు ఆవిరి..
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుండి ఎలాంటి ప్రత్యేక నిధులు రాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
- పోలవరం ప్రాజెక్టు ఖర్చు భారం పూర్తిగా రాష్ట్రంపై పడింది.
- ఉద్యోగ కల్పనకు ఏ ఒక్క కేంద్ర ప్రాజెక్టు కూడా కేటాయించలేదు.
- సీజీఎస్టీ రద్దుపై ఏ నిర్ణయమూ లేదు.
- రాజధాని అభివృద్ధి నిధులు మంజూరు కాలేదు.
- వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులు రాలేదు.
- రైల్వే జోన్ పై స్పష్టత రాలేదు.
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై నిశ్శబ్దం.