2024 నవంబరులో కూటమి ప్రభుత్వం ఒక మెమో జారీ చేసింది, అందులో ప్రభుత్వ పాఠశాలలలో రాజకీయ, మతపరమైన, వివాహ వేడుకలు, ఇతర ఈవెంట్లు నిర్వహించరాదని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు అదే ప్రభుత్వం తన నియమాలను ఉల్లంఘిస్తోందా?
పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని సోమల మండలానికి చెందిన జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో జనసేన పార్టీ తన రాజకీయ సమావేశాన్ని నిర్వహించనుంది. ఇదే ప్రభుత్వం కొద్ది నెలల క్రితం ఇలాంటి కార్యక్రమాలను నిషేధించింది. ఇప్పుడు ఎందుకు మినహాయింపు?
ప్రభుత్వం మాట తప్పిందా?
ప్రభుత్వమే పెట్టిన నిబంధనలను ప్రభుత్వమే అమలు చేయకపోవడం పై ప్రజల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు ప్రజాస్వామిక విలువలకు విరుద్ధంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వం స్పందిస్తుందా?
ప్రభుత్వ నిషేధాన్ని ఉల్లంఘించి జనసేనకు అనుమతి ఎలా ఇచ్చారు? ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం వత్తాసు పలికితే భవిష్యత్తులో ప్రభుత్వ స్కూళ్లను రాజకీయ వేదికలుగా మార్చే ప్రమాదం ఉందా?
ప్రజల్లో ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రభుత్వ హిపోక్రసీని ప్రశ్నిస్తూ విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఈ అంశంపై కూటమి ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి.
Also read:
https://voiceofandhra.org/telugu/2025/01/31/chandrababu-government-education-schemes-dues/