తిరుపతిలో టీడీపీ అరాచకం – వైసీపీ మాజీ మంత్రి రోజా ఫైర్

తిరుపతి: తిరుపతి జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలపై వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక తిరుపతి పరువు ఎలా దిగజారిందో చూస్తున్నాం అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

తిరుపతిలో వరుస ఘటనలు – రోజా ఆగ్రహం

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుపతిలో వరుసగా అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయని రోజా మండిపడ్డారు. “లడ్డు” వివాదం, ఆలయ తొక్కిసలాట ఘటన, ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎన్నికల హంగామా… అన్నీ తిరుపతి పరువును మసకబారుస్తున్నాయన్నారు.

డిప్యూటీ మేయర్ ఎన్నికలో దాడులు – వైసీపీ కార్పొరేటర్ల కిడ్నాప్

తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా దళిత ఎంపీపై దాడి చేయడం దారుణం అని రోజా నిప్పులు చెరిగారు. వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడం అప్రజాస్వామికం అని మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్, టీడీపీపై రోజా తీవ్ర వ్యాఖ్యలు

“పవన్ కళ్యాణ్ గారు, మీ ఎమ్మెల్యే తిరుపతిలో దిగజారి ఇవన్నీ చేస్తున్నాడు, కానీ మీకు కనపడలేదా?” అంటూ రోజా ప్రశ్నించారు. “మీరు నిజంగా ప్రజా మద్దతుతో గెలిచి ఉంటే ఇలా కిడ్నాప్, దాడులకు దిగాల్సిన అవసరం ఏమిటి?” అని నిలదీశారు.

“రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన” – రోజా

టీడీపీ నేతలు అరాచకంగా ప్రవర్తిస్తున్నారని, బస్సుపై దాడి చేసి వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని ఆరోపించారు. “ఇది ప్రజాస్వామ్యం కాదు, రెడ్ బుక్ పాలన” అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు.

“బలం లేకున్నా పదవులు కైవసం చేసుకుంటున్న టీడీపీ”

టీడీపీ మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో బలం లేకపోయినా “దొంగ గెలుపుతో” పదవులను కైవసం చేసుకోవడం దారుణం అని రోజా విమర్శించారు. తిరుపతిలో జరిగిన ఈ సంఘటనలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Also read:

https://voiceofandhra.org/telugu/2025/02/03/andhra-pradesh-municipal-by-elections-violence/

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *