ఎన్డిఎ మరియు వైస్సార్సీపీ మొదటి ఎనిమిది నెలల పరిపాలన వ్యత్యాసం

పాలనా రంగంలో, మాటల కంటే చేతలే గట్టిగా వినపడుతాయి. ఏ ప్రభుత్వంలోనైనా మొదటి కొన్ని నెలలు, ప్రభుత్వం యొక్క  ప్రాధాన్యతలు, సామర్థ్యాలు మరియు దృక్పథాన్ని వెల్లడిస్తాయి. వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సిపి ప్రభుత్వ మొదటి ఎనిమిది నెలలను చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో పోల్చినప్పుడు, వ్యత్యాసం స్పష్టంగా కనపడుతుంది.

తొలి ఎనిమిది నెలల పాలన: అభివృద్ధి నుండి నిర్లక్ష్యం వరకు

  1. రైతులకు వైయస్ఆర్ రైతు భరోసా vs. డొల్ల  వాగ్దానాలు: వైయస్ఆర్సిపి రైతు భరోసా కింద రైతులకు ఏటా ₹13,500 పెట్టుబడి సహాయం ఇచ్చింది. ఎన్డిఎ దీనిని ₹20,000 కు పెంచుతామని హామీ ఇచ్చింది, కానీ ఈ ఖరీఫ్ సీజన్లో ఉన్న ₹13,500 పెట్టుబడి మద్దతును కూడా నిలిపివేసింది, దీనివల్ల రైతులు ఇబ్బందుల్లో పడ్డారు మరియు వారి సంక్షేమం పట్ల చంద్రబాబుకి ఎంత చిత్తశుద్ధి ఉందొ స్పష్టమైపోయింది.
  2. అమ్మఒడి vs. అబద్ధపు హామీ : వైస్సార్సీపీ  యొక్క అమ్మఒడి పథకం పేద విద్యార్థుల తల్లులకు ఏటా ₹15,000 అందించింది, ఇది పాఠశాలలో వారి  నమోదును పెంచింది. గత ఎన్నికల సమయంలో పాఠశాలల్లో చదివే ఒక్కో పేద విద్యార్థికి  ₹15,000 అందిస్తామని, ఇలా ఒక్క ఇంట్లో ఎంత మంది పిల్లలు అంతమందికి ₹15,000 ఇస్తామని చెప్పిన ఎన్డిఎ ఇప్పుడు ఆ పథకానికి పూర్తిగా చరమగీతం పడింది.
  3. నాడునేడు vs. విద్యారంగంపై నిర్లక్ష్యం: వైస్సార్సీపీ ప్రభుత్వం  నాడునేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం, ఐబీ పాఠ్య ప్రణాళిక మరియు మూడవ తరగతి నుండి విద్యార్థులకు టోఫెల్  శిక్షణ లాంటి విప్లవాత్మక చెర్యలు చేపట్టింది. ఎన్డిఎ ఏ విధమైన విద్యా సంస్కరణలను ప్రవేశపెట్టకపోగా ఐబీ మరియు టోఫెల్ లాంటి విప్లవాత్మక సంస్కరణలను నిలిపివేసింది. ఇంకా ఎన్డిఎ ప్రభుత్వం ₹3,900 కోట్ల విలువైన ఫీజు రీయింబర్స్‌మెంట్‌లను ఆలస్యం చేసింది, ఇది 12 లక్షల మంది కళాశాల విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేసింది.
  4. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇంటెరిన్ రిలీఫ్  (IR): వైస్సార్సీపీ ప్రభుత్వం  ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రభుత్వంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఇంటెరిన్ రిలీఫ్ అందచేసి లక్షలాది కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించింది. దీనికి విరుద్ధంగా, ఎన్డిఎ, DA మరియు IR పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ, ఉద్యోగుల జీతాలను సైతం సకాలంలో చెల్లించడంలో విఫలమైంది. గత నెలలో, చాలా మంది ఉద్యోగులు 5 నుండి 15వ తేదీ మధ్య జీతాలు పొందారు మరియు ఈ నెల, 4వ తేదీ వచ్చిన కూడా ఇంకా జీతాల చెలింపులు జరగలేదు.
  5. దిశ చట్టం & యాప్ vs. పెరుగుతున్న అభద్రత: మహిళల భద్రత కోసం వైస్సార్సీపీ కఠినమైన చట్టాలను అమలుచేసింది  మరియు ఆపత్కార పరిస్థితులలో మహిళల భద్రత కోసం SOS లాంటి అధునాతన సాంకేతిక సదుపాయాలతోటి దిశా యప్ని అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు ఎన్డిఎ పాలనలో, మహిళలు మరియు పిల్లలపై నేరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి, చట్టాల అమలు బలహీనంగా మారింది దీనితో  ప్రజా భద్రత దెబ్బతింది, బెల్ట్ షాపులను ప్రోత్సహించే లోపభూయిష్ట మద్యం విధానం ద్వారా ఇది మరింత పెరిగింది.
  6. ఆరోగ్య శ్రీ విస్తరణ vs. ఆరోగ్య సంరక్షణ పతనం: YSRCP ఆరోగ్య శ్రీని విస్తరించింది, సకాలంలో ఆస్పత్రులకు చెలింపులు చేయడంద్వారా ప్రజలకు సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందించగలిగింది. సకాలంలో ఆస్పత్రులకు బకాయిలు చెల్లించడంలో ఎన్డిఎ విఫలమైయ్యింది దీని వలన వైద్యసేవలు నిలిచిపోయి ప్రజారోగ్య వయవస్థకు ముప్పు  తలెత్తిన్ది.
  7. సచివాలయ వ్యవస్థ vs. పరిపాలనలో  ఉదాసీనత: వైస్సార్సీపీ  సచివాలయ వ్యవస్థ ద్వారా 1.6 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించింది, ప్రతి గ్రామానికి పాలనను తీసుకువచ్చింది. దీనికి విరుద్ధంగా, ఎన్డిఎ ప్రభుత్వం వాలంటీర్  వ్యవస్థను విచ్ఛిన్నం చేసింది మరియు స్థానిక పాలనను బలోపేతం చేయడంలో విఫలమైంది, ప్రజలు  ప్రాథమిక సేవల కోసం చాలా దూరం ప్రయాణించవలసి వస్తుంది. ఇది చలదు అన్నట్టు ఇప్పుడు, సచివాలయ హేతుబద్ధీకరణ సాకుతో దాదాపు 56,000 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తును కూడా ప్రమాదంలో పడేస్తోంది.
  8. స్వచ్ఛంద సేవకుల వ్యవస్థ vs. వ్యవస్థను కూల్చివేయడం: వైస్సార్సీపీ నలుగు లక్షల మంది వాలెంటీర్లను నియమించి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరేలా చూసింది, నిరుద్యోగులకు తాత్కాలిక ఉపశమనం కల్పించగలిగింది మరియు అట్టడుగు స్థాయి పాలనను చేరవేసింది. ఎన్డిఎ ఈ వ్యవస్థను మెరుగుపరచడంలో విఫలమైంది, వాలెంటీర్లను ₹10,000 గౌరవ వేతనంతో కొనసాగిస్తామని హామీ ఇచ్చి  వంచించింది మరియు తద్వారా ప్రజలు ప్రభుత్వ సేవలను పొందేందుకు అడ్డంకులను పెంచింది.
  9. జీవనోపాధిని స్థిరీకరణ  vs. అబద్ధపు హామీలు  : ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా, అధికారంలోకి వచ్చిన మొదటి కొన్ని నెలల్లోనే వైస్సార్సీపీ వాహన మిత్ర వంటి పథకాలను ప్రారంభించింది. ఈ పథకం ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లకు వార్షిక ఆర్థిక సహాయాన్ని అందిస్తు, వారి జీవనోపాధిని స్థిరీకరిస్తుంది. దీనికి విరుద్ధంగా, ఎన్డిఎ ప్రభుత్వం తన మ్యానిఫెస్టో వాగ్దానాలను, “సూపర్ సిక్స్అని కూడా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది.
  10. ఆర్థిక బాధ్యత vs అప్పుల పాలన: ఒకప్పుడు సంక్షేమ పథకాలపై ఖర్చు చేస్తున్నందుకు ఎస్సార్సీపీని విమర్శించిన చంద్రబాబు నాయుడు, “సూపర్ సిక్స్వాగ్దానాల కింద అమలుసాధ్యంకాని ఉచితాలను ప్రకటించారు కానీ వాటిలో దేనినీ అమలు చేయలేదు. కేవలం ఆరు నెలల్లోనే ₹1,12,750 కోట్లు అప్పుగా తీసుకున్నప్పటికీఇది రికార్డు మొత్తం. ఈ అప్పు ద్వారా సమకూర్చిన నిధుల్లో ఏదీ ప్రజా సంక్షేమానికి ఉపయోగించలేదు. ఇందులో కేవలం అమరావతి పేరుతో ₹31,000 కోట్లు అప్పుగా తీసుకున్నారు, కానీ ఈ నిధులను చంద్రబాబు అతని సన్నిహితులకు ప్రయోజనం చేకూర్చడానికి మళ్లించారు, తద్వారా రాష్ట్ర ఆర్థిక స్థిరత్వాన్ని ప్రమాదంలో పడేస్తూ, భవిష్యత్ తరాలపై భారం మోపారు.

ఎన్డిఎ ప్రాధాన్యతలు:  స్వార్ధంతో కూడిన పాలనా  వైఫల్యాలు

  1. తిరుపతి తొక్కిసలాట: ప్రభుత్వ నిర్లక్ష్యం వాళ్ళ జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ భయంకరమైన పాలనా వైఫల్యం ప్రభుత్వంపట్ల  ప్రజల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ విషాదం చంద్రబాబు నాయుడు మరియు ఎన్డిఎ పవిత్రమైన తిరుమల లడ్డూ మరియు శ్రీ వెంకటేశవరస్వామి పేరుని, ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల ద్రుష్టి మాలించేందుకు మరియు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం వలెనే సంభవించింది అని ప్రజలు నాముతున్నారు
  2. విజయవాడ వరదలు: ముందస్తు చర్యలు లేకపోవడం, సరైన ప్రణాళిక లేకపోవడం, నిర్లక్ష్యంతో కూడిన ప్రభుత్వ స్పందన కారణంగా వరదల వాళ్ళ ఊహించని  విధ్వంసం సంభవించింది.
  3. దావోస్ నిరాశ: ఇతర రాష్ట్రాలు పెట్టుబడులు సాధించగా, ఆంధ్రప్రదేశ్ మాత్రం దావోస్ పర్యటన కోసం 30 కోట్ల ప్రజాధనాన్ని  ఖర్చు చేసి ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్) నుండి ఖాళీ చేతులతో తిరిగి వచ్చింది, ఇది ప్రభుత్వానికి వ్యూహాత్మక దూరదృష్టి లేకపోవడాన్ని బహిర్గతం చేసింది. ఇది ఇలా ఉండగా GST వసూళ్లలో క్షీణత ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో లోపాలని  చూపుతుంది.
  4. ధరల పెరుగుదల: పెరిగిన విద్యుత్ ఛార్జీలు మరియు రిజిస్ట్రేషన్ ఫీజులు సామాన్య ప్రజలపై ఆర్థిక భారాన్ని పెంచాయి. ఇది ఎన్డిఎ మరియు చంద్రబాబు  ఇచ్చిన ఆర్థిక ఉపశమనం యొక్క వాగ్దానాలకు విరుద్ధంగా ఉన్నాయి.

ప్రభుత్వ నిర్ణయాలు పాలనలో వారి  ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తుంది

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైస్సార్సీపీ ప్రభుత్వం మొదటి ఎనిమిది నెలలు ప్రజాకేంద్రీకృత పాలన, సంక్షేమ పథకాలు మరియు సమ్మిళిత అభివృద్ధిపై స్పష్టమైన దృష్టితో పాలనను అందించింది. దీనికి విరుద్ధంగా, మొదటి ఆరు నెలల్లోనే ₹1,12,750 కోట్ల రుణాన్ని తీసుకున్నప్పటికీ, చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించడంలో విఫలమైంది, నాడునేడు వంటి అభివృద్ధి ప్రాజెక్టులను నిలిపివేసింది మరియు ఉద్యోగులకు IR మరియు DA కూడా చెల్లించడం లేదు. రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టి అప్పుల ద్వారా వచ్చిన నగదును ప్రైవేట్ జేబుల్లోకి మళ్లించడంపైనే  మొత్తం ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించినట్లు అనిపిస్తుంది.

ఇది  కేవలం రెండు ప్రభుత్వాల విజయాలు మరియు వైఫల్యాల గురించి కాదు; ఇది ఇరు పక్షాల ప్రాధాన్యతలలోని ప్రాథమిక వ్యత్యాసం గురించి. వైస్సార్సీపీ తమపాలనలో ప్రజాసంక్షేమానికి తొలిప్రాధాన్యత ఇచ్చింది. ఎన్డిఎ ప్రభుత్వం మాత్రం తమ స్వప్రయోజనాలకు మొదటి పప్రాధాన్యతనిస్తూ తమకి ఇంతటి అపూర్వవిజయని ఇచ్చిన ప్రజల నమ్మకాని కోల్పోతుంది.

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *