రెండు రోజుల ముందు తూర్పుగోదావరి జిల్లా వెంకటాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేత తన కారు కడిగించుకున్న టీచర్ ఘటన మరువక ముందుకే, ఏలూరు జిల్లా చాకపల్లిలోని శ్రీ చైతన్య స్కూల్లో ఎల్కేజీ విద్యార్థినిని టీచర్ అమానుషంగా కొట్టి స్పృహకోల్పోయేలా కోల్పోయేలాగా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ గారు తన కర్తవ్యాలను మరచి రెడ్ బుక్ పేరిట కక్షా రాజకీయాలు చేయడమే పరమావధిగా పెట్టుకున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో విద్యావ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని విమర్శలు వెల్లువెతుతున్నాయి.
ఇది ఇలా ఉంటే గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన నో బ్యాగ్ సాటర్డే పథకాన్ని అధికారంలోకి రాగానే నిలిపివేసి దాన్ని ఇటీవల మల్లి పునః ప్రారంభించి తామే ఆ పథకాన్ని తీసుకొచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటున్నా మంత్రి లోకేష్, ప్రభుత్వం తరఫున సరైన నిఘా లేకపోయేసరికి ఈ నో బ్యాగ్ సాటర్డే పేరిట పలు ప్రభుత్వ పాఠశాలలో పసిపిల్లలతోటి వెట్టి చాకిరీ చేయిస్తున్నారు అనే ఆరోపణలకు మాత్రం సమాధానం ఇవ్వటం లేదు.
గత ప్రభుత్వం నాడు నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థుల కోసం తీసుకొచ్చిన అనేక సంస్కరణలను, తెలుగుదేశం పార్టీలోని వారికోసం ముఖ్యంగా విద్యను తమ వ్యాపారంగా మలుచుకున్న మంత్రి నారాయణ లాంటి వారికోసం నారా లోకేష్ దెగ్గర వుంది నీరుగార్చారు. ఇప్పుడు ఇదే క్రమంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింతగా నాశనం చేసి విద్యను వ్యాపారంగా మార్చి తద్వారా తాను తన పార్టీ లాభపడాలి అని మంత్రి నారా లోకేష్ గట్టిగా కృషి చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరోవైపు కాలేజీ విద్యార్థులకు చెల్లించవలసిన ఫీజు రీయంబర్స్మెంట్ లు దాదాపు 3900 కోట్ల వరకు ఎన్డీఏ ప్రభుత్వం బకాయి పడింది దీనివల్ల 12 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.