టీడీపీ చిరకాల వాంచ Vs గిరిజనుల అత్మభిమానా పోరాటం…. గెలుపు ఎవెరిది?

గత నెల 27 విశాఖపట్నంలో జరిగిన టూరిజం పెట్టుబడిదారుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుంది. సదస్సులో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు ఆంధ్రప్రదేశ్లోని  వైజాగ్, లంబసింగి మరియు అరకు వంటి ప్రాంతాల్లో టూరిజం లో ప్రైవేట్ పెట్టుబడులకు భారీ అవకాశాలు ఉన్నాయని, దీనికి 1/70 యాక్ట్ అడుగా నిలుస్తుందని, దీనిని సవరించ వలసిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆక్ట్ వల్ల గిరిజనుల భూమి ఇతరులకు బదిలీ చేయకుండా నిబంధనలు ఉన్నాయి, దీనివల్ల ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలు ఇక్కడ టూరిజం లో పెట్టుబడులు పెట్టట్లేదు, అదేవిధంగా అక్కడ ఉండే గిరిజనులకు వాళ్ళంతట వాళ్ళు పెట్టుబడులు పెట్టే అంత స్తోమత లేదని గిరిజనులు కించపరిచి, వారి అధికారాలకు తూట్లు పొడిచే విధంగా అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్పటికే మండిపడుతున్న గిరిజన సంఘాలు ట్రైబల్ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఫిబ్రవరి 11, 12 రెండు రోజులపాటు బందుకు పిలుపునిచ్చాయి.

అయితే ఒక్కసారి చరిత్ర తిరగేసి చూస్తే ఇప్పుడు అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమో లేదా టూరిజం అభివృద్ధి కోసమో కాదు అని, ఇది మొదటి నుంచి టిడిపి విధానపరమైన నిర్ణయాల్లో ఒకటి అని, అలాగే ఆ ప్రాంతంలో ఉన్న బాక్సైట్ మైన్లను ప్రైవేట్ సంస్థలకి అప్పగించి తద్వారా లాభం పొందాలన్న చంద్రబాబు చిరకాల స్వార్ధపూరిత ఆలోచనలో భాగమని అనిపిస్తుంది.

గతంలో కూడా గిరిజనుల హక్కులకు తూట్లు పొడవాలని చూసిన టిడిపి:

భారతదేశంలోని షెడ్యూల్డ్ తెగల భూహక్కుల పరిరక్షణ కోసం భారతదేశ ప్రభుత్వం ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ 1 ఆఫ్ 1970 ని తీసుకువచ్చింది, దీన్నే 1/70 యాక్ట్ అని కూడా అంటారు. రాజ్యాంగం గిరిజన భూమికి ఇచ్చిన ప్రత్యేక హోదాను పరిగణనలోకి తీసుకుని, గిరిజనేతరులకు గిరిజన భూమి బదిలీ జరగకుండా పరిరక్షణ కల్పించేలా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.

అయితే 1980లలో టిడిపి ఆరంభదశలోనే ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టాన్ని సవరించారు. కానీ అప్పటి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 నీ ఉపయోగించి ఈ సవరణలను నిలిపివేసింది, కేంద్ర ప్రభుత్వం ఈ అధికారాన్ని ఉపయోగించిన ఏకైక సమయం ఇది.

మరోసారి 2000 సంవత్సరంలో అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా  మరియు కేంద్రంలో భాగస్వామిగా అన్న చంద్రబాబు.  విశాఖపట్నం జిల్లా చింతపల్లి అటవీ ప్రాంతంలో 550 మిలియన్ టన్నుల బాక్సైట్ గనులను దుబాయ్ కి చెందిన డుబల్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు, అసెంబ్లీలో బిల్లు పాస్ అవ్వదని  గ్రహించి, గిరిజనుల అభ్యున్నతి కోసం సలహాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన TAC (ట్రైబ్స్  అడ్వైజరీ కౌన్సిల్) పైన ఒత్తిడి తీసుకొచ్చి వారి ద్వారా ప్రతిపాదనలను  గవర్నర్కు పంపి తద్వారా రాష్ట్రపతికి ఉన్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకొని 1/70 యాక్ట్ లో ఉన్న  భూ హక్కులను బదలాయింపు నిబంధనలను  సవరించాలని చూశారు. కానీ ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న రాజశేఖర్ రెడ్డి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ విషయాన్ని బట్టబయలు చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేసరికి, అనేక గిరిజన హక్కుల పరిరక్షణ సంఘాల నుండి వ్యతిరేకత రావడం  మరియు న్యాయపరమైన చిక్కులు  వచ్చే అవకాశం ఉండడం వల్ల,  ప్రజా ఆగ్రహాన్ని గ్రహించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

స్పీకర్ మాటలు వెనకాల కుట్ర దాగి ఉన్నదన్న అనుమానాలు:

గతంలో చంద్రబాబు వేసిన ఈ ఎత్తుగడలను దగ్గరగా గమనించిన గిరిజన హక్కుల పరిరక్షణ సంఘాల నేతలు ఇప్పుడు స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నమాట వెనకాల చంద్రబాబు స్వార్థపూరిత ఆలోచనలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. అందుకే ఐక్యవేదిక (JAC) గా ఏర్పడి గిరిజనుల హక్కుల పోరాటానికి సిద్ధ పడుతున్నామని చెబుతున్నారు. అయితే మరోసారి విజయం గిరిజన ప్రజలది అవుతుందా లేదా టిడిపి స్వార్థపూరిత ఆలోచనలదా? అనేది  వేచి చూడాలి.

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *