విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వాలంటీర్ల హక్కుల కోసం పోరాడుతూ, మహిళా వాలంటీర్ మమత ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేశారు. కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో, వారి గొంతుకగా చట్టసభల్లో నిలవాలని ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మమత అభ్యర్థిత్వం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వాలంటీర్లను ప్రోత్సహించి, తర్వాత వారి హక్కులను తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు. “వాలంటీర్ల సేవలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్న ప్రభుత్వం, ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదు. అందుకే, ఈ ఎన్నిక ద్వారా వాలంటీర్ల గొంతుకను ఎమ్మెల్సీ హౌస్‌లో వినిపించేందుకు నేను బరిలోకి దిగాను” అని మమత స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల పోటీ వాలంటీర్లలో చైతన్యం తీసుకురావడమే కాకుండా, రాజకీయ పార్టీలకు కూడా కొత్త మలుపు తిప్పనుంది. మమత నామినేషన్ అనంతరం వాలంటీర్లలో మద్దతు పెరుగుతుందా? లేక కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.