ఆంధ్రప్రదేశ్లో 2020-2025 మధ్య 15,635 కొత్త కంపెనీలు
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో పరిశ్రమలు రాలేదన్న ఆరోపణలను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. లోకసభలో టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆమె, గత ఐదేళ్లలో రాష్ట్రంలో 15,635 కొత్త కంపెనీలు నమోదయ్యాయని తెలిపారు.
🟢 జిల్లాల వారీగా పరిశీలిస్తే:
🔹 విశాఖపట్నం – 3,076 కంపెనీలు
🔹 కృష్ణా – 2,564 కంపెనీలు
🔹 గుంటూరు – 2,164 కంపెనీలు
🔹 తిరుపతి, ఏలూరు – అత్యల్పంగా ఒక్కొక్కటి
📊 సంవత్సరాల వారీగా కొత్త కంపెనీల నమోదు:
✅ 2020-21: 2,488
✅ 2021-22: 3,243
✅ 2022-23: 2,953
✅ 2023-24: 3,664
✅ 2024-25: 3,287
కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద భారీ నిధులు
కేంద్ర మంత్రిగారి ప్రకారం, 2018-19 నుండి 2022-23 మధ్యకాలంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద ఆంధ్రప్రదేశ్లో రూ.3,707.43 కోట్లు ఖర్చు అయ్యాయి.
జగన్ పాలనపై టీడీపీ ఆరోపణలు తప్పుదారి?
టీడీపీ నేతలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో పరిశ్రమలు రాలేదని ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు ఆ ఆరోపణలను తిప్పికొట్టాయి. గత ఐదేళ్లలో 15,635 కొత్త కంపెనీలు రాగా, భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి.
ఈ గణాంకాలు పరిశీలించినప్పుడు “జగన్ హయాంలో పరిశ్రమలు రాలేదు” అనేది అసత్య ప్రచారంగా కనిపిస్తోంది.
Also read:
https://voiceofandhra.org/telugu/2025/02/12/chandrababu-pension-cuts-disabled-people-outrage/