విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం వల్లభనేని వంశీని విజయవాడ పడమట పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. భర్త కోసం హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరిన పంకజ శ్రీని కారును నందిగామ వై జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
అవకాశం లేకుండా పోలీసుల ముద్ర
పంకజ శ్రీని ప్రయాణిస్తున్న కారును పోలీసులు రోడ్డుపై నిలిపి, ముందు సీటులో ఉన్న వ్యక్తిని బలవంతంగా దింపారు. ఆ తర్వాత ఆ వాహనంలో కంచికచర్ల సీఐ కూర్చొని, కారును దారి మళ్లించి ముందుకు తీసుకెళ్లారు.
పంకజ శ్రీని దీనిపై ప్రశ్నించగా, పోలీసుల నుంచి ఎలాంటి స్పష్టమైన సమాధానం రాలేదు. వల్లభనేని వంశీ భార్యను ఎక్కడికి తరలించారు అనే విషయం తెలియరాలేదు.
Also read: