విజయవాడ ఆర్టీసీ గ్రౌండ్స్‌లో జరుగుతున్న కాశ్మీర్ జలకన్య ఎక్సిబిషన్‌లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదు స్టాల్స్ పూర్తిగా కాలిపోయాయి. గ్యాస్ సిలిండర్లు పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. సుమారు 25 లక్షల ఆస్తి నష్టం జరిగినా, ఎవరికీ ప్రాణ హాని జరగలేదు. అయితే, ఈ ప్రమాదానికి రాజకీయ నేతల ఒత్తిడి, అధికారుల నిర్లక్ష్యమే కారణమా? అనే ప్రశ్నలు ప్రజల్లో వస్తున్నాయి.
నాణ్యత లేని సిలిండర్లు, బ్లాక్ మార్కెట్ సరఫరా:
స్థానికుల చెప్పిన సమాచారం ప్రకారం, ఎక్సిబిషన్‌లో ఉపయోగించిన గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ నుంచే తెచ్చినవి. వీటికి సరిగ్గా భద్రతా ప్రమాణాలు లేవు. అయినా కూడా అధికారులు వాటిని అనుమతించడమే ప్రమాదానికి కారణమా?
ప్రభుత్వ అధికారులు ఎందుకు లైసెన్స్ చెక్ చేయలేదు?
ఎక్సిబిషన్‌లో వాడే గ్యాస్ సిలిండర్ల భద్రత తనిఖీ చేయాల్సిన అధికారులందరూ విజయవాడ వెస్ట్ కి సంబంధించిన అధికార పార్టీ నాయకుడి ఒత్తిడికి లోనయ్యారా? అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
“25 లక్షల నష్టం” కాకుండా ప్రాణానష్టం జరిగినట్లయితే…?
సిలిండర్ల పేలుడు వల్ల 5 స్టాల్స్ మాత్రమే కాకుండా, మరింత విస్తృత నష్టం సంభవించి, ప్రాణహాని జరిగితే, ఎవరు బాధ్యత వహిస్తారు? ఇలాంటి ప్రమాదాలకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరగొచ్చు.
ఇకపై ఏం చేయాలి?
అధికారులు రాజకీయ ఒత్తిడికి లొంగకూడదు. ఎక్సిబిషన్ లాంటి జనసంద్రహం అధికంగా వుండే చోట్ల భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలి. బ్లాక్ మార్కెట్ గ్యాస్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ఈ ప్రమాదం ప్రజా భద్రతను అధికారులు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు అన్న విషయని మరోసారి స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం, పోలీసులు, అధికారులు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Also read:
https://voiceofandhra.org/telugu/2025/02/13/chittoor-sand-mafia-protest-te/