మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టు.. రాష్ట్రంలో కక్షా రాజకీయాలకు ప్రారంభమా? ముగింపా?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కక్షలు ఎల్లలు దాటుతున్నాయి. ఇది మీడియా టాక్ కాదు పబ్లిక్ టాక్. అధికారం మారాక గత ప్రభుత్వం నాయకుల మీద వ్యవస్థల ప్రోద్భలంతో కక్ష తీర్చుకోవడం సాధారణమే అయినప్పటికీ కూటమి ప్రభుత్వంలో ఆ డోస్ పెరిగిందా.. అంటే ప్రజలు నిజమే డోస్ పెరిగిందని మాట్లాడుకుంటున్నారు. 2014 కంటే ముందు ఈ స్థాయి రాజకీయ కక్ష ఉండే కాదన్నది ప్రస్తుత హాట్ టాపిక్. 40 ఏళ్ల అనుభవంతో అధికారంలో ఉన్న చంద్రబాబు కూడా ఇలాంటి విధానాలకు స్వస్థి పలకలేడా అన్నది ప్రజల్లో ఉన్న ప్రశ్న. ఈ ప్రశ్నలకు తాజాగా జరిగిన పరిణామాలు రాష్ర్టంలో రాజకీయ కక్ష్యలకు, కక్షా రాజకీయాలు, రాజకీయ అరెస్టులకు అంతం లేదనే నిజమనే భావన కల్పిస్తోంది.

రెండు రోజుల క్రింత మాజీ ఎమ్మెల్యే వల్లభవనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నేళ్ల క్రితం నమోదైన కేసులో అరెస్టు జరగడంతో ప్రజలు దీన్ని రాజకీయ కక్షగానే భావిస్తున్నారు. దీని అనంతరం జరిగిన ఓ సమీక్షలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాజకీయ నాయకుల ముసుగులో ఉండే అరాచక శక్తులను అణిచివేయాల్సిందే అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. దీని అర్థం రాష్ర్టంలో మరిన్ని అరెస్టులు, కేసు విచారణలు జరగనున్నాయనే విషయం స్పష్టం అవుతోంది. ఇలాంటి అరాచక శక్తులు ఒక పార్టీలోనే కాదు అన్ని పార్టీల్లోనూ ఉన్నాయన్న విషయం ప్రభుత్వానికే కాదు, పోలీసులు, ప్రజలకు కూడా తెలుసు. అయితే వారందరిపై ఉన్న కేసులు విచారించి అరెస్టులు చేస్తారా లేదా ఇతర పార్టీ నేతలను మాత్రమే అరెస్టు చేస్తారా అన్నది కీలకమైన ప్రశ్నగా ఉంది.

ఇదంతా ఒక ఎత్తైతే గత ప్రభుత్వంలో బీసీలపై జరిగిన దాడులపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అంటే గతంలో జరిగిన దాడులపై విచారణ వేగవంతం కానుంది. ఈ విచారణ అప్పట్లో సంచలనంగా మారిన అన్ని కేసులపై ఉంటుందా లేక రాజకీయ కక్షలకే పరిమితం కానుందా అనేది టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడే అభిప్రాయానికి కీలకంగా ఉంటుంది. ప్రత్యేక కమీషన్ ఏర్పాటు సమయంలో జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ హయాంలో బీసీలను ఊచకోత కోశారని, వారి హత్యలపైనా విచారణ వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్ష పడేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రత్యేక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. బీసీ రక్షణ చట్టాన్ని సబ్‌కమిటీ నివేదిక రాగానే అమల్లోకి తెస్తామన్నారు. దీంతో పాటు బీసీ రుణాలపై ఆడిట్‌ చేయాలని సీఎం చంద్రబాబు అధికారు­లను ఆదేశించారు. బీసీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు తీసుకొని లబ్ధి పొందిన వారి సమాచారాన్ని సేకరించాలని చెప్పారు.

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *