ఆంధ్రప్రదేశ్‌లోని వైద్య విద్యాసంస్థలను పిపిపి మోడల్ లో ప్రైవేటు పరం చేయాలని చూస్తూ చంద్రబాబు మరియు ఎన్డీఏ ప్రభుత్వం ఎంత పెద్ద చారిత్రాత్మక తప్పిదం చేస్తుంది అనడానికి నిన్న మదనపల్లిలో యువతిపై యాసిడ్ దాడి ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అద్దం పడతాయి.
దాడికి గురైన యువతిని మొదట 108 అంబులెన్స్‌లో గుర్రం కొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ ఎవరూ లేకపోవడంతో మదనపల్లి లోని ఆసుపత్రికి తరలించారు అక్కడ ప్రాథమిక చికిత్స చేసి సరైన వసతులు పోవడంతో మెరుగైన వైద్య సేవల కోసం బెంగళూరు కి తరలించారు.
అయితే ప్రతిసారి ఆ ఆపత్కార పరిస్థితులలో ప్రాణాలు కాపాడడానికి ఇంత సమయం లభిస్తుందా? అందుకే గత ప్రభుత్వంలో అత్యవసర పరిస్థితుల్లో ఏ పేదవాడు ఇబ్బంది పడొద్దు అని, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి మారుమూల ప్రాంతానికి మెరుగైన వైద్య సేవలను విస్తరించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్రంలో 17 నూతన వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టింది. వీటిలో 5 ఇప్పటికే అందుబాటులోకి వచ్చి పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడంతోపాటు, ఆ ప్రాంతంలోని ప్రజలకి మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు అందిస్తున్నాయి. రెండో విడతలో మరో అయిదు కళాశాలలు అందుబాటులోకి రావాల్సి ఉన్నాయి కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఈ ఐదు కళాశాలల్లో మిగిలిన పనులను పూర్తి చేయకుండా వీటిని ప్రైవేట్ పరం చేసే పనికి శ్రీకారం చుట్టింది. ఈ రెండో విడత కళాశాలలో మదనపల్లె ప్రభుత్వ వైద్య కళాశాల కూడా ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గతంలో నడుస్తున్న పనులను అలాగే కొనసాగించి ఉంటే ఇప్పటికే ఈ వైద్య కళాశాల మరియు దానికి అనుబంధమై ఉండే ఆస్పత్రి అందుబాటులోకి వచ్చేవి. మిగిలిన పనులు పూర్తి చేయకపోగా అప్పటికే పులివెందుల మరియు పాడేరు లాంటి ప్రాంతాల్లో అనుమతులు వచ్చిన వైద్య కళాశాలలోని ఎంబీబీస్ సీట్లను సైతం వెనక్కి తీసుకోవాల్సిందిగా ఎన్డీఏ ప్రభుత్వం NMC (నేషనల్ మెడికల్ కమిషన్) కి లేఖలు రాయడం ద్వారా ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలకు ఎంతటి అన్యాయం చేస్తుందో అర్థమవుతుందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఇది ప్రభుత్వంకి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఎంత అని చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమే. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థను గాలికి వదిలేశారు, పేరొందిన ప్రభుత్వ ఆసుపత్రిలో సైతం నిర్వహణ లోపించింది. నిన్న తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, రోగులపై నర్సింగ్ సిబ్బంది మరియు డాక్టర్ల నిర్లక్ష్యం పై తిరుపతి జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేసిన ఘటన రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిని వివరిస్తుంది.