కేంద్ర మంత్రికి సీఎం లేఖ ఒక పెద్ద బోగస్ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టీకరణ
నెల్లూరు:
వైయస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సీఎం చంద్రబాబు మిర్చి రైతులపై రాజకీయ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…
- ‘నాఫెడ్’ కు లేఖ రాసిన సీఎం మిర్చి రైతులను వంచించారు
- గతంలో ఏనాడూ నాఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరగలేదు
- చిత్తశుద్ధి ఉంటే ఎంఐఎస్ ద్వారా ఆదుకోవాలని కోరేవారు
- అసలు మిర్చి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశం సీఎంకు లేదు
- ఉద్యాన శాఖ అధికారులిచ్చిన రిపోర్టును పట్టించుకోలేదు
జగన్ పర్యటన వల్లే రైతు సమస్యలపై చలనం
గుంటూరు మిర్చి యార్డులో జగన్ పర్యటన సందర్భంగా భద్రతా వైఫల్యం ఉద్దేశపూర్వకమని ఆయన ఆరోపించారు.
- జగన్ పర్యటనలో భద్రత కల్పించలేదు
- ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఓర్వలేకపోతున్నారు
- జగన్ పర్యటన వల్లే రైతు సమస్యలపై చర్చ మొదలైంది
ప్రశ్నిస్తే కేసులా?
“రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న డిమాండ్‌తో జగన్ రైతుల మధ్యకి వెళ్లితే, తట్టుకోలేక ప్రభుత్వంచేత విజప్రచారం చేయిస్తోంది.”
భద్రత లేకుండా ఉద్దేశపూర్వక చర్యలు
“జగన్ ప్రజల మధ్యకి వెళ్లకూడదు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టకూడదు అన్న ఉద్దేశంతోనే భద్రత కల్పించలేదు. చివరికి రోప్ పార్టీ సైతం ఏర్పాటు చేయలేదు.”
నా ఛాలెంజ్
“మీకు ధైర్యం ఉంటే, మిర్చి యార్డుకు వెళ్లి రైతులను నేరుగా కలవండి. వారు మీ పాలనను ఎలా అనుభవిస్తున్నారో అర్థమవుతుంది!”
నాఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు పచ్చి అబద్ధం
“నాఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు చేయాలని చంద్రబాబు లేఖ రాయడం రైతులను మోసం చేయడమే. నాఫెడ్ కొనుగోళ్లు గతంలో ఎప్పుడూ జరగలేదు.”
ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు
“వైయస్సార్సీపీ హయాంలో రైతులకు మద్దతు ధరతో పాటు పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ అందించాం. కానీ ఇప్పటి ప్రభుత్వం అన్నింటినీ నిర్లక్ష్యం చేస్తోంది.”
Also read:
https://voiceofandhra.org/telugu/2025/02/20/ys-jagan-calls-chilkur-balaji-priest-rangarajan/