అల్లూరి సీతారామరాజు జిల్లా: అనంతగిరి మండలం కొండశిఖర బూరిగ గ్రామ ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రక్షిత తాగునీటి కోసం ఎన్నిసార్లు అధికారులను కోరినా సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల మొర పట్టని RWS అధికారులు
గ్రామంలో తాగునీటి ఎద్దడిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు స్పందించకపోవడం తీవ్ర అసంతృప్తికి దారితీసింది. RWS పీఓ అధికారిని ఎంత విన్నవించుకున్నా సమస్య యథాతథంగానే ఉందని గ్రామస్థులు వాపోయారు. “ఇదిగో వస్తున్నాం, అదిగో చేసేస్తాం” అని అధికారుల మాటలు వినిపిస్తున్నాయి కానీ, పనిలో కదలిక కనిపించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ప్రజల సమస్యలు ఎవరికి పట్టవా?
తాగునీటి కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందన లేకపోవడం బాధాకరమని గ్రామస్థులు అంటున్నారు. “నీటి సమస్య తీరే వరకు పోరాటం తప్పదు” అని ప్రజలు హెచ్చరిస్తున్నారు.
స్థానిక అధికారులు ప్రజల సమస్యలను పట్టించుకుంటారా? సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారా? అనేది చూడాల్సిందే.