ఈ గురువారం (ఫిబ్రవరి 20) తిరుపతి పర్యటనలో నారా లోకేష్ టిడిపి నాయకులతో భేటీ అయిన అనంతరం టిడిపి నాయకులు చెప్పినట్టే కార్యకలాపాలు జరగాలని నగర అధికారులకు సూచనలు ఇచ్చినట్టు సమాచారం. ఈ చర్య పార్టీని బలోపేతం చేయడానికే అనుకుంటున్నా, మిత్రపక్షాల మధ్య ఉన్న విభేదాలను బయట పెట్టింది.
అలాగే, తిరుపతిలో రెడ్ బుక్ రూల్స్ కఠినంగా అమలు అవుతున్న విషయమై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ రూల్స్‌ను కొంత మందికి మాత్రమే ప్రయోజనం చేకూరేలా, ప్రత్యర్థులను అణిచివేయడానికి, మరీ ముఖ్యంగా మిత్రపక్షాలను నియంత్రించడానికి వాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
కూటమిలో లోకేష్ కంట్రోల్: టీడీపీ నాయకులకు మాత్రమే స్వేచ్ఛ?
నారా లోకేష్ రెడ్ బుక్ రూల్స్ కేవలం ప్రతిపక్ష నేతలకే కాదు, టీడీపీ ఆదేశాలను పాటించని మిత్రపక్షాలకు కూడా వర్తిస్తాయని స్పష్టంగా చెప్పారు. ఇదే తిరుపతిలోనూ కనిపించింది. స్థానిక టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదులపై స్పందించిన లోకేష్, తిరుపతి కమిషనర్‌కు తానే స్వయంగా ఆదేశాలు ఇచ్చి, అన్ని కాంట్రాక్టులు టీడీపీ అనుకూల నేతలకే ఇవ్వాలని చెప్పినట్టు తెలుస్తుంది. ఈ ఆదేశం స్థానిక జనసేన ఎమ్మెల్యే శ్రీనివాస్ సూచనలను పక్కన పెట్టినట్టయింది. దీంతో లోకేష్ కు, ఆయన రెడ్ బుక్ కు కూటమి నాయకులు కూడా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
తిరుపతి మేయర్ కు అవమానం: టీడీపీ ఆధిపత్య రాజకీయాలకు సంకేతమా?
తిరుపతిలో మరొక వివాదాస్పద ఘటన జరిగింది. నగర మేయర్‌ను టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, డీసీపీ అవమానించారు. దీనిపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసి, కమిషనర్‌ను చర్యలు తీసుకోవాలని కోరినా, ఆమె అభ్యర్థనను పట్టించుకోలేదు. ఈ అన్యాయానికి నిరసనగా, మేయర్, కార్పొరేటర్లు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.
కూటమిలో నిశ్శబ్దం: లోకేష్ చేతిలో అధికారం?
పరిపాలన కేవలం లోకేష్, టీడీపీ నాయకుల కనుసన్నల్లోని మాత్రమే నడుస్తున్నా, కూటమి ప్రభుత్వంలో మిగతా పార్టీలు మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాయి. దీంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం పూర్తిగా లోకేష్ చేతుల్లోకి వెళ్ళిపోయిందా? లేక అవి కావాలనే ఊరుకుంటున్నదా?
లోకేష్ కంట్రోల్ మరింత పెరుగుతోందా? ఇదే ఇంక పాలనా భవిష్యత్తు కానుందా? లేక కూటమి ఈ పెరుగుతున్న నియంత్రణపై ప్రశ్నించబోతున్నారా?
తిరుపతిలోనూ రెడ్ బుక్ రూల్స్: ఇక మిత్రపక్షాలు కూడా బలి?
