అలాగైతే తక్షణం ప్రభుత్వం నుంచి వైదొలగాలి – వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి
📍 పులివెందుల:
ప్రతిపక్ష పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ అనుకుంటే కూటమి ప్రభుత్వం నుంచి బయటకు రావాలని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పులివెందులలోని వైయస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో గెలిచిన నాలుగు పార్టీల్లో మూడు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే బాధ్యత వైయస్సార్సీపీదేనని స్పష్టం చేశారు.
▪️ ప్రతిపక్ష గుర్తింపు అంటే ఏమిటి?
వైయస్ జగన్ అసెంబ్లీలో ప్రతిపక్ష గుర్తింపు గురించి మాట్లాడిన దానిని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేయడం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రజాగళంను బలంగా వినిపించేందుకు అసెంబ్లీలో ఎక్కువ సమయం లభించాలని జగన్ కోరుతున్నారని, అందుకే ప్రతిపక్ష హోదాను వైయస్సార్సీపీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు.
▪️ పవన్ కళ్యాణ్‌కు రాజకీయ అవగాహన ఉందా?
పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష పాత్ర గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎస్వీ సతీష్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో జనసేన రెండో అతిపెద్ద పార్టీగా ఉందని, ప్రతిపక్ష హోదా తమకే దక్కుతుందని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే ప్రతిపక్షం హోదా కోరడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఆయన తెలిపారు. నిజంగా పవన్ ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకుంటే తక్షణమే ప్రభుత్వం నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు.
▪️ చంద్రబాబు చేతిలో పవన్ కళ్యాణ్ కీలుబొమ్మ?
పవన్ కళ్యాణ్ పూర్తిగా చంద్రబాబు వశమైన వ్యక్తిగా మారిపోయారని, తాను చెప్పాలనుకున్నదాన్ని పవన్ కళ్యాణ్ నోటితో చెప్పిస్తున్నారని ఎస్వీ సతీష్ రెడ్డి ఆరోపించారు. జనసేన అధినేత ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే ప్రతిపక్ష హోదా కోరడం రాజకీయ అవగాహన లేని చర్య అని అన్నారు.
▪️ ఎన్నికల హామీల భయం ఎందుకు?
సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకుండా, వైయస్సార్సీపీ ప్రశ్నిస్తుందనే భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి చంద్రబాబు, పవన్ కలిసి కుట్రలు చేస్తున్నారని అన్నారు.
▪️ షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలా? లేక చంద్రబాబు వ్యూహకర్తా?
కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉంటూ షర్మిల వ్యక్తిగత అజెండాతో పని చేస్తున్నారని, ప్రజాసమస్యలపై దృష్టి పెట్టకుండా చంద్రబాబుకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నాటి సోనియా గాంధీని ఎదిరించి వైయస్ జగన్ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు.
📌 “ప్రతిపక్ష పాత్ర నిజంగా పోషించాలనుకుంటే, పవన్ కళ్యాణ్ తక్షణమే ప్రభుత్వం నుంచి వైదొలగాలి!” – ఎస్వీ సతీష్ రెడ్డి🔥