ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొత్తగా ప్రవేశపెట్టిన OTP ఆధారిత OP రిజిస్ట్రేషన్ విధానం రోగులకు శాపంగా మారింది. సులభతరం చేయాల్సిన టెక్నాలజీ, మారుమూల గ్రామాల్లోని పేద, వృద్ధ రోగులకు చికిత్స అందకుండా చేస్తోంది.
ఇంతకుముందు రోజుకు 250-300 OP టికెట్లు జారీ చేసేవారు. కానీ ఇప్పుడు ఈ సంఖ్య 90-100కే పరిమితం అయింది. వెంటనే చికిత్స అవసరమైన అనేక మంది రోగులు, OTP అందుబాటులో లేకపోవడంతో, వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేయాల్సిందే కానీ కష్టతరం చేయాల్సిన అవసరం లేదు. అయితే చంద్రబాబు నాయుడు ‘టెక్ రివల్యూషన్’ అని ప్రచారం చేసుకుంటూ, టీడీపీ ప్రభుత్వ హయాంలో టెక్నాలజీ పేరుతో ప్రజలను వేదిస్తున్న పరిస్థితి నెలకొంది. ఆసుపత్రుల్లో మౌలిక వసతులను మెరుగుపరిచే పనిలో పడకుండా, మందుల సరఫరాను పెంచకుండా, వైద్యులను నియమించకుండా, ఇటువంటి డిజిటల్ అవరోధాలను ప్రజలపై రుద్దుతున్నారు.
వృద్ధుల విషయానికి వస్తే, వారికి మొబైల్ ఫోన్ ఉండకపోవచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సరిగ్గా ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఈ OTP విధానం వారికి ఒక తలనొప్పిగా మారింది. రోగులకు అసలు కావాల్సింది మందులా? లేక చంద్రబాబు నుంచి వచ్చే ఒక WhatsApp మెసేజా?
ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి రావాల్సింది కానీ, టెక్నాలజీ అడ్డంకిగా మారడం దురదృష్టకరం. ప్రజల ఆరోగ్యానికి నిజంగా అవసరమైనది మందులా, లేక OTP కోడ్‌లా?