ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు శనివారం తిరుమలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో, ఆయన తిరుమల శ్రీవారి దర్శనం ముందు డిక్లరేషన్ ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు.
తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు ప్రకటించారు. అక్టోబర్ 24వ తేదీ వరకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ ఆంక్షల కింద, తిరుపతి జిల్లాలో ఎలాంటి ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించినా, వాటికి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.