తాడిపత్రి మున్సిపల్ చైర్‌పర్సన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, తాజాగా చేసిన వ్యాఖ్యలతో చర్చకు లోనయ్యారు. మద్యం షాపుల లైసెన్సు పొందిన వారు తమ లాభాల్లో 15% ను పట్టణ అభివృద్ధికి అందించాలని ఆయన సూచించారు. అదేవిధంగా, మద్యం బాటిల్‌కు 20 పైసలు వ్యక్తిగత వాటాగా ఇవ్వాలని కూడా అభిప్రాయపడ్డారు.
శనివారం సాయంత్రం పెద్దవడుగూరులో జరిగిన తన అనుచరుల సమావేశంలో ప్రభాకర్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రిలో మద్యం షాపుల లైసెన్సుల కోసం స్థానికేతరులు ఎందుకు దరఖాస్తు చేసుకుంటున్నారో ఆయన ప్రశ్నించారు, ఇది అంగీకరించదగినది కాదని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో తనను ఇబ్బంది పెట్టిన వారిని తాడిపత్రిలోకి రానివ్వబోమని చెప్పారు. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పట్టణంలోకి రాకుండా అడ్డుకున్నట్లు ఆయన పేర్కొన్నారు, దీనికి సంబంధించిన వివరాలను తన మద్దతుదారులతో పంచుకున్నారు.
ఈ వ్యాఖ్యలు పట్ల ప్రజల మద్య ప్రాధమిక చర్చలు జరుగుతున్నాయి.
https://x.com/VoiceofAndhra3/status/1845728189982622007?s=19