ఇసుక, మద్యం దోపిడీ: జగన్‌ ప్రెస్ మీటులో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు – కీలక సమాచారం విడుదల

అమరావతి, అక్టోబర్ 18: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్‌లో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా ఉచిత ఇసుక, మద్యం విధానాల పేరిట జరిగిన దోపిడీని ప్రశ్నించారు. జగన్ వెల్లడించిన వివరాల ప్రకారం, టీడీపీ పాలనలో ఇసుక రేట్లు మూడు రెట్లు పెరిగాయని ఆరోపించారు. ఇసుక టెండర్లు కూడా టీడీపీ అనుకూలులకు కట్టబెట్టినట్లు ధ్వజమెత్తారు.

సూపర్ 6 లేదా 7?

వైఎస్ జగన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో సూపర్ సిక్స్ లేదా సూపర్ 7 బడ్జెట్ గురించి ప్రజలు ప్రశ్నించకూడదని భావించారని అన్నారు. వోట్ ఆన్ అకౌంట్ ద్వారా 8 నెలలపాటు రాష్ట్రాన్ని నడిపించడం ఏపీ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని విమర్శించారు.

 

ఉచిత ఇసుకపై విమర్శలు

జగన్ ప్రెస్ మీట్‌లో ఉచిత ఇసుక పథకం పెద్ద ఎత్తున దోపిడీకి గురైందని ఆరోపించారు. 141 నియోజకవర్గాల్లో ఇసుక లారీకి రూ. 20 వేలకు పైగా ధర పెట్టారని, 30 నియోజకవర్గాల్లో రూ. 30 వేలకు పైగా, మిగతా చోట్ల రూ. 60 వేలకు పైగా లారీ ఇసుక ధరలుగా నిర్ణయించారని చెప్పారు. ఇసుక టెండర్లను అక్టోబర్ 8న ఇచ్చి, 10వ తేదీ నాటికి పండగ రోజుల్లోనే క్లోజ్ చేశారని, ఇది టీడీపీ వారికి టెండర్లను కట్టబెట్టడానికే చేశారని ఆరోపించారు.

 

మద్యం షాపుల ప్రైవేటీకరణ

మద్యం షాపులను ప్రైవేట్ వారికి అప్పగించి, ప్రభుత్వం 30% కమీషన్ తీసుకుంటుందని జగన్ ఆరోపించారు. MRP కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతూ, దానిపైనా కమీషన్ తీసుకోవడం దారుణమని పేర్కొన్నారు.

 

స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఈడీ క్లీన్ చిట్?

స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పడంపై జగన్ తీవ్రంగా స్పందించారు. ఈడీ నోటీసులను చదివి వినిపిస్తూ, రూ. 55 కోట్లు దుర్వినియోగమయ్యాయని తాము అనుభవించినట్లు ఈడీ చెప్పినప్పుడు, బాబు క్లీన్ చిట్ అని ఎలా చెప్పగలరని ప్రశ్నించారు.

EVM ల విషయమై ప్రశ్నలు

EVM ల విషయమై 12 బూత్‌లలో VV ప్యాట్‌లు పోల్చి చూడాలని తాము కోరితే, ఎన్నికల కమిషన్‌కు అభ్యంతరం ఎందుకు అని జగన్ ప్రశ్నించారు. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే అనుమానాలు తీరుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

voa_editor1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *