ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెడ్ సాండల్‌వుడ్ విక్రయం, ఎగుమతుల కోసం సింగిల్-విండో సిస్టమ్ అమలు చేయాలని ప్రతిపాదించారు. ఇది అంతర్జాతీయ ఈ-వేలంపాటల ద్వారా రెవెన్యూ పెంచడంలో మరియు సరళీకృత విధానాల రూపకల్పనలో కీలక పాత్రా పోషిస్తుంది అని ఆయన తేయాలిపారు.
బుధవారం ఢిల్లీ పర్యటనలో కేంద్ర అటవీ మరియు పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిసి ఈ ప్రతిపాదనపై చర్చించారు. రెడ్ సాండల్‌వుడ్ ప్రత్యేకతను గుర్తుచేస్తూ కేంద్రీకృత విధానాల ద్వారా రక్షణను మెరుగుపరచడమే లక్ష్యమని పవన్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖను ఈ సిస్టమ్‌కు కస్టోడియన్‌గా నియమించాలని ప్రతిపాదించారు, ఇది గ్రేడింగ్, వేలం, ఎగుమతులను సమర్థవంతంగా నిర్వహించగలదని ఆయన అభిప్రాయపడ్డారు. బోటానికల్ సర్వే ఆఫ్ ఇండియా సూచనల ప్రకారం, అన్ని రాష్ట్రాల్లో సీజ్ చేసిన రెడ్ సాండల్‌వుడ్ ను ఆంధ్రప్రదేశ్‌కు తరలించి వేలంపాట ద్వారా అమ్మాలని పవన్ కోరారు.
అదనంగా, జల్ జీవన్ మిషన్ పథకం కింద తాగునీటి పథకాలకు నిధులు విడుదల చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే, ఇప్పటికే చేపట్టిన పనుల గడువు పొడగించాలని కోరారు.