వైసీపీ అధినేత జగన్ కీలక ఉద్యమాలకు సర్వం సిద్ధం

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ తీరుపై పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. ప్రజల ఆగ్రహాన్ని ఓ కార్యాచరణ రూపంలో నిలదీసేందుకు డిసెంబర్ నుంచి జనవరి వరకు మూడు ముఖ్యమైన కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించారు.

డిసెంబర్ 11:

రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌ల వద్ద నిరసనలు.

  • ధాన్యం సేకరణకు గడువు పెంపు.
  • మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్.
  • ఉచిత పంట బీమా పునరుద్ధరణ.

డిసెంబర్ 27:

విద్యుత్ చార్జీల పెంపుపై ఎస్సీ లేదా సిఎండి విద్యుత్ కార్యాలయాల వద్ద ఆందోళనలు.

  • పెంచిన చార్జీలను తగ్గించాలని డిమాండ్.

జనవరి 3:

విద్యార్ధుల ఫీజు రీయింబర్స్మెంట్, వసతి, విద్యాదీవెన బకాయిల విడుదల కోసం కలెక్టరేట్‌ల వద్ద నిరసనలు.

ఈ ఉద్యమాల ద్వారా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వడమే లక్ష్యంగా జగన్ ప్రణాళికలు రూపొందించారు.

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *