కరెంటు చార్జీల పెంపు పై వైఎస్సార్సీపీ నిరసన

విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ పోరుబాట చేపట్టింది. విశాఖలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, ఇతర ముఖ్య నాయకులు కలిసి నిరసన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు:

  • విద్యుత్ ఛార్జీల పెంపు పై ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తామని వెల్లడించారు.
  • జెపిసీ పర్యటనల గురించి ప్రస్తావిస్తూ, వైఎస్సార్‌సీపీ ప్రజల తరపున పోరాటానికి సిద్ధమని చెప్పారు.
  • “మేము న్యూట్రల్ గా ఉన్నాం, రాష్ట్ర ప్రయోజనాలే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు.

గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు:

  • ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలను పెంచమని హామీ ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన వెంటనే భారీగా భారాన్ని మోపిందని విమర్శించారు.
  • “వచ్చే నెల నుంచి విద్యుత్ యూనిట్ పై అదనంగా రూ.1.50 వరకు భారాన్ని మోపుతారు” అని ఆందోళన వ్యక్తం చేశారు.
  • “ఆరు నెలల కాలంలో రూ. 75 వేల కోట్ల అప్పు చేసి, సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు.”

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతున్నట్లు తెలిపారు.

Also read:

https://voiceofandhra.org/telugu/2024/12/24/tirupati-annamacharya-santa-hat-controversy/

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *