ఏపిలో కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతరేకంగా ప్రతిపక్ష వైఎస్సార్ సిపి పోరుబాట పట్టింది. గతంలో రైతులకు మద్దతుగా తలపెట్టిన రైతు పోరుబాట జిల్లా కేంద్రాల్లో విజయవంతం అయ్యింది. అదే నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రకటించిన విద్యుత్ చార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో పోరుబాట పేరుతో ఆందోళనలు నిర్వహించి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఖండించింది.
విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నిరసన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయి. వైజాగ్, కాకినాడ, విజయవాడ, అనంతపురం నగరాల్లో జరిగిన పోరుబాట ప్రత్యేకంగా నిలించింది. ఈ ఆందోళనల్లో ప్రజల భారీ స్థాయిలో పాల్గొన్నారు.
పోరుబాట కార్యక్రమం విజయంతం చేసిన ప్రజలు పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలపై రూ.15,485 కోట్ల భారాన్ని మోపడం దారుణమని, ఇది కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు.
ఉచిత విద్యుత్ పథకం నిలిపివేత రైతులకు వెన్నుపోటు:
గత ప్రభుత్వంలో అమలైన రైతులకు ఉచిత విద్యుత్ అందించే పథకం నుంచి ఎస్సీ, ఎస్టీలను దూరం చేయడం రైతులను నట్టేట ముంచినట్టాన్నారు. ఇది ఎస్సీ, ఎస్టీల పట్ల చంద్రబాబు వివక్షకు నిదర్శనం అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించి విద్యుత్ ఛార్జీల పెంపు వంటి చర్యలతో ప్రజలను దారుణంగా మోసం చేసిందని విమర్శించారు.
గత టీడీపీ ప్రభుత్వంలో విద్యుత్ సంస్థలు భారీ నష్టాల్లోకి వెళ్లిన దుస్థితిని వివరించారు.
కూటమి ప్రభుత్వంపై 6 నెల్లలోనే ప్రజాగ్రహం..
విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్లపైకి రావడం కూటమి ప్రభుత్వం పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. వైఎస్సార్ సిపి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వందలాది మంది ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించారని వివరించారు. వైఎస్సార్ సిపి ప్రభుత్వంలో అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకం రైతులకు గొప్ప భరోసాగా నిలిచిందని, కూటమి ప్రభుత్వం రైతులకు శత్రువుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, మోసపూరిత నిర్ణయాలకు ప్రజలు మరచిపోరని అన్నారు.